22, జనవరి 2015, గురువారం

గ్రహాలు వృత్తి కారకత్వాలు

గ్రహాలు వృత్తి కారకత్వాలు

సూర్యుడు : వైద్యశాస్త్రం,బౌతికశాస్త్రం,కుజునితో కలసిన శస్త్ర చికిత్సకునిగా,గురువుతో కలసిన ఆయుర్వేదం,శనితో కలసిన అనస్తీషియా,ఆర్ధోఫిడిక్స్ వైద్యుడు,చంద్ర,శుక్రులతో కలసిన గైనకాలజిస్ట్,బుధునితో కలసిన నరాల నిపుణులు,మరియు కర్ణరోగ వైద్యం సూచించును.రాజ్యాధికారము , పరిపాలనా విభాగాములకు అధికారి , ఆఫీస్ మేనేజ్ మెంట్ , అధ్యక్ష పదవులు, ధార్మిక సంస్థలు , సంఘములకు గౌరవ అధ్యక్షులు మొదలగు అనేక విధముల యజమాని హోదా పొందగలరు. చట్ట సభలలో అధికారము, శాసన నిర్మాణ కర్తలు , ప్రజా పరిపాలకులు . ఆర్డర్స్ జారీ చేయు అధికారము , హోదా , గౌరవము కలిగిన వృత్తులను ప్రసాదించును.

ప్రదోష వ్రతం (Pradosha Vratam)

ప్రదోష వ్రతం

సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు, సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు "ప్రదోషోరజనీముఖమ్" రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు.ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు. 

చతుర్ముఖి రుద్రాక్ష (4 Face Rudraksha)

బుదగ్రహ దోష నివారణకు చతుర్ముఖి రుద్రాక్ష

చతుర్ముఖి రుద్రాక్షను బ్రహ్మ స్వరూపంగా,సరస్వతి దేవి స్వరూపంగా చదువులో రాణించటానికి,వ్యాపారంలో అభివృద్ధి కొరకు మెడలో ధరించాలి.జ్యోతిష్యంలో బుదగ్రహ దోషం ఉన్నవారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి.చతుర్ముఖి రుద్రాక్షను సోమవారం రోజు గాని,బుధవారం రోజు గాని శివాలయంలో అభిషేకం చేపించి మెడలో ధారణ చెయ్యాలి. 

9, జనవరి 2015, శుక్రవారం

జాతకం పరిశీలించటం ఎలా?

పుష్కరాంశ

"పుష్కరాంశ" ఈ పదం ప్రతి హిందూ ఆలయ,విగ్రహ,వివాహ అహ్వాన పత్రిక యందు ,అన్ని శుభ ముహూర్తాలయందు ఉంటుంది.

ఉదా:-స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సర నిజ జ్యేష్ట నవమీ గురువారం హస్తా నక్షత్ర యుక్త కర్కాటక లగ్న పుష్కరాంశ యందు అనగా 23-6-1988నస్వామి వారల పునః ప్రతిస్టా మహోత్సవం.

7, జనవరి 2015, బుధవారం

గ్రహాల సంచారం

గ్రహాల సంచారం

ఒకొక్కరాశి 30 డిగ్రీల నిడివి కలిగి ఉంటుంది.12 రాశులుంటాయి .రాశి చక్రం మొత్తం 360 డిగ్రీలు ఉంటుంది.ప్రతి గ్రహాం రాశిలో ఉన్న 30 డిగ్రీలలో 27 డిగ్రీలు దాటిన తరువాత రాబోవు రాశిని చూచును.

రవి గ్రహాం(SUN):-ఒక్కొక్క రాశిలో నెల రోజులుండును.5 రోజులు ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.రవి రోజుకు "1"డిగ్రీ చొప్పున సంచారం జరుపును.

బాలారిష్టం

12 సంవత్సరములలోపు మరణాన్ని సూచించే యోగాన్ని "బాలారిష్టం" అందురు.

అనగా... 8లో చంద్రుడు, 7లో కుజుడు, 9లో రాహువు, లగ్నంలో శని,3లో గురుడు, 5లో రవి, 6లో శుక్రుడు, 4లో బుధుడు, 12లో కేతువు బాలారిష్టాలనిస్తారు. కాని, ఆ గ్రహ దశలు జననకాల దశలయితే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దోష గ్రహంపై శుభ గ్రహ దృష్టి ఆ దోషాన్ని తగ్గిస్తుంది.

రాశులు,గ్రహాలరీత్యా శరీర భాగాలు

రాశులు,గ్రహాలరీత్యా శరీర భాగాలు.

జాతకుని శరీరభాగములలో ఏభాగము పరిపుష్టి కలిగి ఉండునో,ఏభాగము బలహీనంగా ఉండునో,ఆయా రాశులయందు ఉన్న గ్రహాములయొక్క శూభా శుభములను బట్టి తెలియును,కాలపురుషుని అవయవ విభాగము మేషాదిగా చూచినట్లుగానే జాతకుని అవయవ విభాగము లగ్నము నుండి చూడవచ్చును.
కాలపురుషుని అంగములు లగ్నము నుండి మొదటి ఆరు రాశులు కుడివైపు భాగమును,ఏడవరాశి నుండి పన్నెండో రాశి వరకు ఎడమవైపు భాగమును చూడవలెను.

ఆగ్నేయమూలకు గ్రహాధిపతి శుక్రుడు

ఆగ్నేయమూలకు గ్రహాధిపతి శుక్రుడు. 


పాలకుడు అగ్నిదేవుడు. వాహనము మేక. శుక్రుడు (రాక్షస గురువు). రాక్షసులకు ఉన్న వేగము, పాలకుడైన అగ్నిదేవునికి ఉన్న శక్తి ఈ ఆగ్నేయ మూలకు ఉన్నది. అందుచేత ఆగ్నేయమూలలో అతి పనికిరాదు. అన్ని మూలలు దిక్కులకంటే అత్యంత సూక్ష్మంగా ఆగ్నేయ దిక్కును చూసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం పొరపాటు చేసినా విపరీత పరిణామాలు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మూడనమ్మకాలు గల నక్షత్రాలు

మూడనమ్మకాలు గల నక్షత్రాలు

మూల నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే మామగారు చనిపోతారని,మతాంతరంలో మొదటి పాదం మాత్రమే హానికరమని,2,3,4 పాదాలు శుభమని చెప్పటం జరిగింది.

అశ్లేష నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే అత్తగారు చనిపోతారని,మతాంతరంలో మొదటి పాదం మాత్రమే శుభమని,2,3,4 పాదాలు అశుభమని చెప్పటం జరిగింది.

5, జనవరి 2015, సోమవారం

నక్షత్ర గణాలు

నక్షత్ర గణాలు
వధూవరుల జాతకం పరిశీలించేటప్పుడు వరుని యొక్క మనస్తత్వం నిర్ణయించటానికి అతని జన్మ నక్షత్రం ఆదారంగా నిర్ణయించవచ్చు. నక్షత్ర విభజన వారి మనస్తత్వ ప్రకారం విభజించబడింది.వధువు నక్షత్రంతో వరుని నక్షత్రం సరిపోతుందో లేదో చూడాలి కానీ వరుని నక్షత్రంతో వధువు నక్షత్రాన్ని పోల్చకూడదు. నక్షత్రాలు 27 .నక్షత్రాలను మూడు భాగాలుగా చేశారు.

షోడశ వర్గ చక్రాలు

జాతకాన్ని పరిశీలించటం

జాతకచక్రంలో కేవలం రాశి చక్రాన్నే కాకుండా బావచక్రాన్ని,నవాంశ చక్రాన్ని,షోడశ వర్గ చక్రాలను కూడా పరిశీలించాలి. జాతకచక్ర పరిశీలన చేసేటప్పుడు షోడశ వర్గ చక్రాలను కూడ జాతకచక్రంలోని పరిశీలించాలి.ఈ షోడషవర్గుల పరిశిలన వలన జాతకచక్రంలోని రహస్యమైన అంశములను తెలుసుకొనుటకు అవకాశము కలదు.

ఈ షోడశవర్గులే కాక జైమిని పద్దతిలోనూ,తాజక పద్దతి యందు పంచమాంశ,షష్ఠాంశ, అష్ఠమాంశ,లాభాంశ లేక రుద్రాంశ అను నాలుగు వర్గులను సూచించినారు.

పంచమాంశ:- పూర్వపుణ్యబలం,మంత్రం,సిద్దించునా లేదా తెలుసుకోవచ్చు.

షష్టాంశ;- అనారోగ్యం అమంతర్గతంగా ఉందా లేదా బహిర్గతమంగా ఉందో తెలుపును.

సంతాన దోష నివారణ


జాతకచక్రంలో సంతాన దోష నివారణకు 7 రకాల రసాలు.

జాతకచక్రంలో సంతానాన్ని పరిశీలించటానికి పంచమస్థానం,తొమ్మిదోస్ధానం,(పంచమాత్ పంచమం) (బావాత్ భావం), జాతకచక్రంలో పంచమం బాగలేకపోయిన నవమస్ధానం బాగున్న సంతానానికి ఎటువంటి దోషం ఉండదు.పంచమస్ధానం సంతానాన్ని తెలియజేస్తే నవమ స్ధానం సత్ సంతానాన్ని కలిగిస్తుంది.అంతేకాక గురుగ్రహాన్ని కూడ పరిశీలించాలి.

జ్యోతిష్య శాస్త్రం(Astrology)


జ్యోతిష్యం శాస్త్రం అనటానికి కొన్ని ఆదారాలు.

జ్యోతిష్యం మూఢనమ్మకంగా కొందరు భావించినా జ్యోతిష్యం "శాస్త్రం" అనడానికి చాలా ఆదారాలు ఉన్నాయి. మన మెదడులోని ద్రవాలలో నవ గ్రహాలకు సంబంధించిన ఖనిజాలు ఉంటాయి. గ్రహాలు పరస్పర ప్రభావం కలిగివుంటాయి. అదేవిధంగా మనిషిపై కూడా ఆ ప్రభావం ఇంకా కొనసాగుతుంది. మానవ మస్తిష్కం గ్రహ గతులకు స్పందిస్తుంది.

సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. చంద్రగమనం కూడా మనపై ప్రభావం చూపిస్తుంది. సముద్రపు అలలు, స్త్రీల ఋతుచక్రం, మానవుల మస్తిష్కం చంద్రగమన ప్రభావానికి లోనౌతాయి. సీజనల్ మెంటల్ డిజార్డర్ గా పిలువబడే (Seasonal Affective Disorder (SAD)) అనే మానసిక రోగం కూడా చలికాలంలో సూర్యుడు చాలాఎక్కువ సేపు కనపడకపోవడం వల్ల సంభవిస్తుంది.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...