7, నవంబర్ 2023, మంగళవారం

హిమాలయ ‘రాక్ సాల్ట్”

హిమాలయ రాక్ సాల్ట్

హిమాలయాల నుండి తవ్విన గులాబీ రంగు స్పటికాలను ఉపయోగించి రాక్ సాల్ట్ ను తయారుచేస్తారు. ఇవి ముఖ్యంగా హిమాలయాల్లో నుండి లభిస్తాయి. హిమాలయాల నుండి వచ్చిన రాక్ సాల్ట్ స్టోన్స్ ప్రదానంగా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది అని శాస్త్రీయంగా నిరూపితమైనది. ఈ రాక్ సాల్ట్ స్టోన్ నందు హైగ్రోస్కోపిక్ లక్షణాలు ఉండటం వలన ఆస్తమా, దగ్గు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆనారోగ్య సమస్యలను నివారిస్తాయి.

హిమాలయ రాక్ సాల్ట్ స్టోన్ కి కొంత కాంతిని ఉపయోగించటం వలన శరీరంలోని నరాల బలహీనత, బద్ధకం, ఒత్తిడి, చెడు ఆలోచన విదానాన్ని తొలగిస్తాయి. అంతేకాక మొభైల్ ఫోన్ల నుండి, మొభైల్ టవర్ల, రేడియో వర్ల నుండి టెలివిజన్ మరియు ఇతర ఎలట్రానిక్ పరికరాల నుండి వచ్చే ప్రతికూల తరంగాల నుండి రక్షిస్తుంది.

17, డిసెంబర్ 2022, శనివారం

జాతకచక్రంలో షష్టమ భావ విశ్లేషణ

జాతకచక్రంలో ష్టమ భావ విశ్లేషణ

పాప గ్రహములు షష్టమ స్ధానం లో ఉన్న శత్రు బాధలు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. లగ్నం నుండి ఆరవ స్ధానం వ్యాధి, విరోధం, ఋణం, బాధ, గాయాలు, మేనమామలు, మానసిక ఆందోళన, ఋణాల బారిన పడటం, తగువులు, దురదృష్ఠం, చెడ్డపేరు, దొంగతనం, అగౌరవం, శత్రుబాధలు వంటి చెడు ఫలితాలతో పాటు విజయాలు,  పరిశీలనా సామర్ధ్యం, పోటీతత్వంతో ముందుకు వెళ్ళటం వంటి శుభ ఫలితాలను కూడా సూచిస్తుంది. అయితే ఈ భావ కారకత్వాల ద్వారా లభించే శుభ ఫలితాలు కూడా మరో విధంగా కొంత బాధను కలిగించటం గమనించాలి. విజయం పొందటం ఆనందదాయకం అయినా ఆ విజయాన్ని పొందటానికి ఎంతో శ్రమించాలి. పైగా సాధించిన విజయాన్ని నిలబెట్టుకోవటానికి నిరంతరం కృషి చేయాలి. అంటే ఆరవ స్ధానం తెచ్చిపెట్టే ఈ విజయం ఎంతో శ్రమకరమైనదిగా గమనించాలి. సత్యాచార్యుల వారు లగ్నాదిగా షష్ఠాధిపతి లగ్నంలో ఉంటే వ్యక్తి అధికార సంపన్నుడు అవుతాడని అదే విధంగా రోగగ్రస్తుడు కూడా కావటం గమనించాలి అని చెప్పారు.

17, నవంబర్ 2022, గురువారం

వైధవ్య యోగం ఉన్న స్త్రీకి దీర్ఘ సుమంగలీ యోగం కలిగించే పరిహారం


శ్లోస్మరేశే కేంద్రరాశిస్ధే రంధ్రే శేనసమన్వితే

పాపగ్రహేణసందృష్టే యోగో వైధవ్య సంజ్ఞికః

తా. సప్తమాధిపతి ఆష్టమాధిపతితో కలసి కేంద్రమందుండి పాపగ్రహముచే చూడబడిన యెడల యా స్త్రీకి వైధవ్యము సంభవమగును.

శ్లో స్మరేశేనిసంయుక్తే భూమిపుత్రేణవీక్షితే

చంద్రరాహుస్థి తేరంధ్రే యోగో వైధవ్య సంజ్ఞికః

తా. సప్తమాధిపతి శనితో కలసియుండి కుజునిచే జూడబడినయెడల యా స్త్రీ వైధవ్యమును బొందును. లగ్నాదష్టమమందు కుజరాహువులున్న యెడల యాస్త్రీకి వైధవ్యము సంభవించును.

11, అక్టోబర్ 2022, మంగళవారం

ఔషద ఆకులు (Sage Leaves)

 


ఔషద ఆకులు (Sage Leaves)

సాల్వియా జాతికి చెందిన తులసి మరియు పుదీనా కుటుంబానికి చెందిన సువాసన, సుగంధ ద్రవ్యాలకు మరియు సాంప్రదాయ మూలికా ఔశదంగా ఈ ఆకులు ఉపయోగపడుతున్నాయి.  సేజ్ అనే మూలిక ఆకులు ఈజిప్షియన్, రోమన్, గ్రీకు, అమెరికన్ వైద్య సాంప్రదాయంలో సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది. భారత దేశంలోని కొన్ని జాతుల వారు సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించేవారు.

కొండ ప్రాంతంలో జీవించే కొన్ని జాతుల వారు హాని కలిగించే బ్యాక్టీరియా మరియు వైరస్ క్రిముల నుండి ఉపశమనం పొందటానికి ఈ ఆకులను ఎండబెట్టి ధూపం వేసి శరీరాన్ని హానికర క్రిముల నుండి రక్షించుకునేవారు. అంతే కాక శరీరంలో కలిగే అనేక రకాల నొప్పులకు ఈ ఆకులు ఉపశమనం కలిగిస్తాయని నమ్మేవారు.

6, సెప్టెంబర్ 2022, మంగళవారం

చింతామణి స్టోన్


చింతామణి స్టోన్
 

చింతామణి స్టోన్ ధాయిలాండ్, టిబెట్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో లభిస్తుంది. చింతామణి స్టోన్ ఆరిజోనా అనే పట్టణంలో సోలమన్ అనే ప్రాంతంలో ప్రధమంగా లభించేవి. చూడటానికి నల్లగా కనబడుతుంది. ఇవి గ్రహ శకలాలు అని నక్షత్ర అవశేషాలు అని కొందరి అభిప్రాయం. సూర్యరశ్మికి గాని బల్బుకి దగ్గరగా ఉంచినప్పుడు తెల్లగా ఉంటుంది. పూర్వకాలంలో రాజుల కాలంలో ఈ స్టోన్ ప్రత్యేకమైన కిరీటాలలోను, కంట మాలలోను, విలువైన రత్నంగా ధరించేవారు.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...