27, ఫిబ్రవరి 2018, మంగళవారం

జలతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

జలతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు 

జలతత్వ రాశులు :- కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారు జలతత్వ రాశులకు చెందినవారు. అధిపతులు వరుసగా చంద్రుడు, కుజుడు, గురువు.  జలతత్వ రాశుల వారు ఆవేశపరులు, చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందటం, కష్ట సుఖాలు, సంపదలను గూర్చి ఎక్కువగా ఊహించుకోవటం. బార్యా పిల్లలతో ఎక్కువ ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. పరిసరాలకు ఆనుగుణంగా లోబడి ప్రవర్తిస్తారు. 

23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

వాయుతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

వాయుతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

వాయుతత్వ రాశులు:- మిధునం, తుల, కుంభ రాశుల వారు వాయుతత్వానికి చెందినవారు. వాయుతత్వ రాశుల వారు ఆలోచనల మీద, ప్రణాళికల మీద, పధకములు వేయుట యందు గడుపుదురు. తెలివితేటలు, సామర్ధ్యంపై విశ్వాసం ఎక్కువ. సాంఘిక కార్యక్రమముల యందు కొత్త
ధకాలు తయారు చేయుట, అనేక మందిని (స్నేహితులను, అధికారులను) కలుపుకొనిపోవుట. కొత్త విషయాలు తెలుసుకొనుట, కొత్త ప్రదేశాలు దర్శించుట వీరి అభిరుచులు. కష్టించి పని చేయటం కష్టం. మానవ జాతికి ఉపకరించు ఏ కార్యక్రమమైన వీరు చేపడతారు. నిస్వార్ధత, మానవ శ్రేయస్సు వీరి యందుండు లక్షణాలు. 

22, ఫిబ్రవరి 2018, గురువారం

భూతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

భూతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

భూతత్వరాశులు:- వృషభం, కన్య, మకర రాశులు భూతత్వానికి చెందినవి. వీటికి వరుసగా శుక్ర, బుధ, శని అధిపతులు. భూతత్వరాశుల వారు మంచి దృడమైన శరీరం కలిగి ఉంటారు. మంచి భోజన ప్రియులు. కూడబెట్టుట, ఏదైనా పనిని ప్రారంభించే ముందు లాభ నష్టములను బేరీజు వేసుకొని ప్రవర్తించెదరు. వ్యక్తిగత విషయాల యందు, ఊహా జగత్తుల యందు విహరించుట. బౌతిక విషయాల యందు, జీవనం నందు విశ్వాసం ఉండును. ఏదైనా పనిని ప్రారంభించిన వదిలిపెట్టరు. వీటిని అర్ధ త్రికోణ రాశులు అని కూడ అంటారు. మంచి జీవనోపాధి కలిగి ఉంటారు. 

21, ఫిబ్రవరి 2018, బుధవారం

వధూవరుల వివాహ విషయంలో జన్మ నక్షత్ర, నామ నక్షత్ర ప్రాధాన్యత

వధూవరుల వివాహ విషయంలో జన్మ నక్షత్ర, నామ నక్షత్ర ప్రాధాన్యత

జాతకాలు చూపించి వివాహం చేసినా లేదా చూపించ కుండా వివాహం చేసినా మనకు బ్రహ్మ లిఖితం ప్రకారం రాసి పెట్టి ఉన్న అమ్మాయి, అబ్బాయిలకే వివాహం అవుతుంది. జాతకాలు చూడడం అనే టెక్నాలజీ ద్వారా మనం ప్రతి సంబంధం గురించి వెంట పడకుండా ఉండటం కోసమే ఈ విధానం చెప్పారు. జాతకాలు చూపించాం కదా అని అవగాహనా లోపాలు, విడాకులు వంటి దోషాలు సమసిపోవు.

అగ్నితత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

అగ్నితత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

అగ్నితత్వ రాశులు :- మేషం, సింహాం, ధనస్సు రాశుల వారు అగ్నితత్వానికి చెందినవారు. వీటికి వరుసగా అధిపతులైన కుజ, సూర్య, గురువు అగ్నితత్వం కలిగి ఉంటారు. అగ్నితత్వ రాశుల వారు ఉష్ణ తత్వం కలిగి కోప స్వభావాలు కలిగిఉంటారు. అగ్నితత్వం కావటం వలన వికాసం, శక్తి సామర్ధ్యాలు, చైతన్యం, ప్రేరణ, సాహసం, పౌరుషం, కోపం మొదలగు లక్షణాలు కలిగి ఉంటారు. న్యాయకత్వం, దైర్యసాహసాలు, శత్రువులపైన విజయాలు.

20, ఫిబ్రవరి 2018, మంగళవారం

హతాజోడి

హతాజోడి
           హతాజోడికి హత్ జోడి, హతాజోరి, హస్తజోడి, హత్తాజోడి అని పిలుస్తారు. హతాజోడి మడచిన చేతుల ఆకారంలో వున్న చాలా అరుదైన మొక్క యొక్క వేరు(మూలం). ఈ మొక్క ముఖ్యంగా మధ్యప్రదేశ్ లోని ‘అమర్ కంటక్’ కొండలలోను మరియు నేపాల్ ‘లుంబిని లోయలో’ను ఎక్కువగా కనబడుతుంది. దట్టమైన పర్వత శ్రేణులు, నదులు ఉన్న ప్రాంతంలో ఈ మొక్కలు సమృద్ధిగా లభిస్తాయి. మధ్య ప్రదేశ్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారి ప్రకారం ఈ మొక్క నీలం రంగుతో తెల్లని పుష్పాలను కలిగి ఉంటుంది. ఇది ఉమ్మెత్త మొక్కను పోలి ఉంటుంది. 

చర, స్ధిర, ద్విస్వభావ రాశుల వారి స్వభావాలు

చర, స్ధిర, ద్విస్వభావ రాశుల వారి స్వభావాలు

మేషం, కర్కాటకం, తుల, మకర రాశులు చర రాశులు.
వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులు స్ధిర రాశులు.
మిధునం, కన్య, ధనస్సు, మీనం రాశులు ద్విస్వభావ రాశులు.

10, ఫిబ్రవరి 2018, శనివారం

నర్మదా బాణలింగం

నర్మదా బాణలింగం 

పురాణాల ప్రకారం నర్మద శివాంశసంభూతురాలని, చంద్రవంశ రాజుకు భార్య అయి నందున ‘సోమోద్భవ’ అని, నాగులకు గంధర్వుల బాధ తొలగించి నందున "నాగకన్య" అని కొన్ని పేర్లతో పిలవబడుతుంది. నాగులకు ఉపకారం చేసినందులకు నర్మద యందలి లభించు బాణ లింగాలకు అభిషేకం చేసిన జలాలు సేవించిన వారికి కాలసర్ప విష భయం ఉండదని నాగులు వరమిచ్చారు. ఈనర్మదా బాణలింగ అభిషేక జలం త్రిదోషహరం, వీర్యవృద్ధి కరం, ఆరోగ్యకరం, రుచికరమని ఆయుర్వేద గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. నర్మదా లింగాన్ని చూచినంత మాత్రముననే కాలసర్పదోషాలు, నాగదోషాలు, సమస్త పాపములు నశించునని పురాణములు ప్రకారం నాగదేవతలు వరం ప్రసాదిస్తున్నవి. 

9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

స్పటిక శివలింగం

స్పటిక శివలింగం 

స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. శివుని శరీరము “ శుద్ధస్ఫటిక సంకాశం ” అని కీర్తింపబడింది. సాక్షాత్తు శివ స్వరూపమైన స్ఫటిక లింగాన్ని ఆరాధించి సేవిస్తే ముక్తి లభిస్తుందని శాస్త్రాలలో పేర్కొనబడింది. శివారాధన వికల్పాలలో విభిన్న వ్యక్తులు విభిన్న శివలింగాలని మాత్రమే పూజించాలని పురాణాలలో ప్రతిపాదిస్తూ స్పటిక లింగాన్ని మాత్రం స్త్రీ పురుష భేదం లేకుండా అందరు సేవించి పరమపదమును పొందవచ్చునని నిరూపింపబడింది. 

8, ఫిబ్రవరి 2018, గురువారం

పాదరస లింగం

పాదరస లింగం విశిష్టత

పాదరస లింగాన్ని పూజా మందిరంలో ఉంచి పూజించవలెను. మహాశివరాత్రి, కార్తీక మాసం  రోజు ఈ లింగాన్ని పూజిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
శ్లో!! వైద్యాయ రసలింగం యో భక్తియుక్తస్సమర్పయేత్!
జగత్రయేపి లింగానాం పూజాఫలమవాప్నుయాత్!!

   ‘పారదలింగ’మనగా పాదరస లింగము. దీనిని యింకా ‘రసలింగ’మనియు, ‘తేజోలింగ’ మనియు చెప్పుదురు. వేదపరముగా పాదరసము ‘శివుని బీజము’ నుండి వచ్చినదని చెప్పబడినది. ఈలింగము చాలా స్వచ్ఛమైనది, శుభకరమైనది. బ్రహ్మపురాణమునందు "పాదరసలింగము’ను సేవించిన ప్రపంచ పరమార్థముల నొందుటయే గాక, ముక్తిని పొందుదురని చెప్పబడినది. బ్రహ్మహత్యాపాతకము కూడా నశించునని దీనిని పూజా గృహము నందు ఎర్రని వస్త్రం పైన ఉంచి పూజించవలెనని చెప్పబడింది. పాదరసమును ఆయుర్వేద శాస్త్రరీత్యా కుందనపు రేకులు, నిమ్మపండు రసంతో స్వేదనం చేసి ఘనీభవింపజేసి లింగరూపముగా చేయుదురు. 

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...