30, నవంబర్ 2018, శుక్రవారం

శనిగ్రహ దోష నివారణకు "Evil Eye"


శనిగ్రహ దోష నివారణకు "Evil Eye"

జాతకచక్రంలో శనిగ్రహ దోష నివారణకు “Evil Eye” బాగా ఉపయోగపడుతుంది. “Evil Eye” నరఘోష నివారణకు ఇంటికి గాని, వ్యాపార సంస్ధలలో గాని, ఆపీసులకు గాని బయటపక్కన తగిలిస్తే ఎటువంటి నరదృష్టి ప్రభావాలు ఉండవు. జాతకంలో నీచశని, జన్మ శని, ఎల్నాటిశని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని దశలు నడిచే వారు “Evil Eye” ఇంటికి గాని, గదికి గాని పశ్చిమ దిక్కు ఉంచి ప్రతి శనివారం ధూపం వేసిన శనిగ్రహ భాదల నుండి విముక్తి కలుగుతుంది. శని వాయు తత్త్వము కలిగి పడమర దిక్కును సూచించును.

9, అక్టోబర్ 2018, మంగళవారం

రాహుగ్రహ దోష నివారణకు "దుర్గా బీస యంత్రం"

రాహుగ్రహ దోష నివారణకు "దుర్గా బీస యంత్రం"
జాతకచక్రంలో రాహు గ్రహా దోషాలు ఉన్నవారు దుర్గా బీస యంత్రాన్ని పూజించిన ఉపశమనం కలుగుతుంది. కాలసర్పదోషం(రాహు కేతువుల మద్య గ్రహాలు) ఉన్నవారు, నాగదోషం (పంచమంలో రాహు గ్రహం) ఉన్నవారు, జాతక చక్రంలో రాహు దశలు జరుగుతున్నప్పుడు దుర్గ బీస యంత్రాన్ని పూజించాలి.

25, సెప్టెంబర్ 2018, మంగళవారం

పంచముఖ హనుమాన్ వాహన నియంత్రణ యంత్రం

పంచముఖ హనుమాన్ వాహన నియంత్రణ యంత్రం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతక చక్రాన్ని అనుసరించి చతుర్ధ స్ధానంలో పాప గ్రహాలు ఉన్న, చతుర్ధాదిపతి పాప క్షేత్రాలలో ఉన్నా, వాహన సౌఖ్య కారకులైన గురు, శుక్రు బాగ లేకపొయిన తరచుగా రొడ్డు ప్రమాదాలు కలగటం, వాహనం నడపాలంటే భయపడటం జరుగుతుంది. తరచుగా   పంచముఖ హనుమాన్ వాహాన నియంత్రణ యంత్రం వాడటం వలన వాహన సౌఖ్యత కలుగుతుంది.

17, సెప్టెంబర్ 2018, సోమవారం

కన్యారాశి, కన్యా లగ్నంలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం.

కన్యారాశి, కన్యా లగ్నంలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం.

కన్యా లగ్నం, కన్యా రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్షలు చతుర్ముఖి, షణ్ముఖి, సప్తముఖి రుద్రాక్షలు. కన్యా  లగ్నానికి లగ్నాధిపతి అయిన బుధుడికి చతుర్ముఖి రుద్రాక్ష, పంచమాధిపతి అయిన శనికి సప్తముఖి రుద్రాక్ష, నవమాధిపతి అయిన శుక్రుడికి షణ్ముఖి రుద్రాక్ష అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్ష కవచం. కన్యా  లగ్నానికి లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతులు యోగ కారకులు. ఈ యోగకారకులు అస్వతంత్ర స్ధానాలలో ఉండి యోగాన్ని ఇచ్చే పరిస్ధితులు లేనప్పుడు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన యోగకారక గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్నా యోగ ఫలాన్ని పొందవచ్చును. మొదటిసారిగా ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు సోమవారం రోజు లేదా బుధవారం రోజు  శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును. 

12, సెప్టెంబర్ 2018, బుధవారం

కుజగ్రహ దోష నివారణకు “బగళాముఖి యంత్రం”

కుజగ్రహ దోష నివారణకు “బగళాముఖి  యంత్రం” 

జాతకంలో కుజ గ్రహ దోష నివారణకు తాంత్రిక దేవతాధిపతిగా బగళాముఖిని పూజిస్తారు. శత్రు పీడలు, ఋణబాధలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ, కోర్టు సమస్యలు, సంసారంలో గొడవలు, అనారోగ్య సమస్యలు, కోపం, అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజ గ్రహ దోషాలకు బగళాముఖి యంత్రం ఉన్న కార్డును మొదటిసారి మంగళవారం రోజు పూజా మందిరంలో ఉంచి పూజ చేసిన పిదప వాహనంలో గాని, ముఖ్యమైన పనుల్లో విజయాల కోసం దగ్గర ఉంచుకొని వెళ్ళటం ద్వారా బగళా దేవి అనుగ్రహం లభించి వాహన ప్రమాదాల నుండి రక్షణ మరియు అన్ని పనుల్లోనూ విజయం సాధించవచ్చును.  

31, ఆగస్టు 2018, శుక్రవారం

శుక్రగ్రహ దోష నివారణకు "ఇంద్రాణి లాకెట్"

శుక్రగ్రహ దోష నివారణకు "ఇంద్రాణి లాకెట్" 

జ్యోతిష్యంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు ఇంద్రాణి లాకెట్ ధరించాలి. శుక్రుడు వివాహం, సౌఖ్యత కారకుడు. దాంపత్య జీవితంలో గొడవలు, సౌఖ్యత లేనివాళ్ళు ఇంద్రాణి లాకెట్ ధరించాలి. వివాహం కాని స్త్రీ, పురుషులు ఇంద్రాణి లాకెట్ దరిస్తే వివాహం తొందరగా జరుగుతుంది.

సింహ లగ్నం, సింహ రాశిలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం

సింహ లగ్నం, సింహ రాశిలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం 

సింహ లగ్నం, సింహ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్షలు ఏకముఖి, పంచముఖి, త్రిముఖి రుద్రాక్షలు. సింహ లగ్నానికి లగ్నాధిపతి అయిన సూర్యుడికి ఏకముఖి రుద్రాక్ష, పంచమాధిపతి అయిన గురువుకి పంచముఖి రుద్రాక్ష, నవమాధిపతి అయిన కుజుడికి త్రిముఖి రుద్రాక్ష అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్ష కవచం. సింహ  లగ్నానికి లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతులు యోగ కారకులు. ఈ యోగకారకులు అస్వతంత్ర స్ధానాలలో ఉండి యోగాన్ని ఇచ్చే పరిస్ధితులు లేనప్పుడు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన యోగకారక గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్నా యోగ ఫలాన్ని పొందవచ్చును. మొదటిసారిగా ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.

20, ఆగస్టు 2018, సోమవారం

కర్కాటక లగ్నం, కర్కాటక రాశిలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం

కర్కాటక లగ్నం, కర్కాటక రాశిలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం 

కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్షలు ద్విముఖి, త్రిముఖి, పంచముఖి రుద్రాక్షలు. కర్కాటక  లగ్నానికి లగ్నాధిపతి అయిన చంద్రుడికికి ద్విముఖి రుద్రాక్ష, పంచమాధిపతి అయిన కుజుడికి త్రిముఖి రుద్రాక్ష, నవమాధిపతి అయిన గురువుకి పంచముఖి రుద్రాక్ష అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్ష కవచం. కర్కాటక  లగ్నానికి లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతులు యోగ కారకులు. ఈ యోగకారకులు అస్వతంత్ర స్ధానాలలో ఉండి యోగాన్ని ఇచ్చే పరిస్ధితులు లేనప్పుడు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన యోగకారక గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్నా యోగ ఫలాన్ని పొందవచ్చును. మొదటిసారిగా ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.

17, ఆగస్టు 2018, శుక్రవారం

దృష్టిదోష నివారణకు 'కాలా నజర్ ట్రీ'

దృష్టిదోష నివారణకు 'కాలా నజర్ ట్రీ'

ఎందరో పెద్దలు, పూర్వులు దృష్టిదోష నివారణకు తమ అనుభవసారం నుంచి చెప్పిన కొన్ని సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ కొన్ని గ్రంధాల (Daawaratantra, Vishwasaara, Raavana Samhitaa) లో చెప్పిన కాలనజర్ మొక్క గురించి తెలుసుకుందాం.

15, ఆగస్టు 2018, బుధవారం

మిధున రాశి, లగ్నంలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం

మిధున రాశి, లగ్నంలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం 

మిధున లగ్నం, మిధున రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్షలు చతుర్ముఖి, సప్తముఖి, షణ్ముఖి రుద్రాక్షలు. మిధున లగ్నానికి లగ్నాధిపతి అయిన బుధుడికి చతుర్ముఖి రుద్రాక్ష, పంచమాధిపతి అయిన శుక్రుడికి షణ్ముఖి రుద్రాక్ష, నవమాధిపతి అయిన శనికి సప్తముఖి రుద్రాక్ష అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్ష కవచం. మిధున లగ్నానికి లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతులు యోగ కారకులు. ఈ యోగకారకులు అస్వతంత్ర స్ధానాలలో ఉండి యోగాన్ని ఇచ్చే పరిస్ధితులు లేనప్పుడు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన యోగకారక గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్నా యోగ ఫలాన్ని పొందవచ్చును. మొదటిసారిగా ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు సోమవారం రోజు గాని గురువారం రోజు గాని శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.

11, ఆగస్టు 2018, శనివారం

ఆయం యొక్క ప్రాముఖ్యత

ఆయం యొక్క ప్రాముఖ్యత

గృహం, శిల్పం, వస్తువుల తయారీకి కొన్ని పద్ధతులు ఉంటాయి. వీటికి పొడవు, వెడల్పులకు సంబందించిన వివరాలు అవసరం. ఈ వివరాలు అన్నింటిని తెలుసుకొని ప్రకృతికి అనుకూలంగా శ్రేయస్సు కలిగే విధంగా నిర్మాణాలు చేయటం వలన జీవితం ఆనందదాయకం అవుతుంది. ఈ విధంగా శాస్త్ర ప్రకారం  నిర్మాణాలు చేయటానికి ఆయం అవసరం. 

10, ఆగస్టు 2018, శుక్రవారం

వృషభ రాశి, వృషభ లగ్నం జాతకుల “అదృష్ట రుద్రాక్ష కవచం”

వృషభ రాశి, వృషభ లగ్నం జాతకుల “అదృష్ట రుద్రాక్ష కవచం” 

వృషభ లగ్నం, వృషభ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్షలు చతుర్ముఖి,  సప్తముఖి, షణ్ముఖి రుద్రాక్షలు. వృషభ లగ్నానికి లగ్నాధిపతి అయిన శుక్రుడికి షణ్ముఖి రుద్రాక్ష, పంచమాధిపతి అయిన బుధుడికి చతుర్ముఖి రుద్రాక్ష, నవమాధిపతి అయిన శనికి సప్తముఖి రుద్రాక్ష అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్ష కవచం. వృషభ లగ్నానికి లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి యోగ కారకులు. ఈ యోగకారకులు అస్వతంత్ర స్ధానాలలో ఉండి యోగాన్ని ఇచ్చే పరిస్ధితులు లేనప్పుడు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన యోగకారక గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్నా యోగ ఫలాన్ని పొందవచ్చును. మొదటిసారిగా ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు సోమవారం రోజు గాని గురువారం రోజు గాని శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.

8, ఆగస్టు 2018, బుధవారం

మేషరాశి, మేష లగ్నం జాతకుల “అదృష్ట రుద్రాక్ష కవచం”

మేషరాశి, మేష లగ్నం జాతకుల  “అదృష్ట రుద్రాక్ష కవచం”

మేష లగ్నం, మేష రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్షలు ఏకముఖి, పంచముఖి, త్రిముఖి రుద్రాక్షలు. మేష లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడికి త్రిముఖి రుద్రాక్ష, పంచమాధిపతి అయిన రవికి ఏకముఖి రుద్రాక్ష, నవమాధిపతి అయిన గురువుకు పంచముఖి రుద్రాక్ష అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్ష కవచం. మేష లగ్నానికి లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి యోగ కారకులు. ఈ యోగకారకులు అస్వతంత్ర స్ధానాలలో ఉండి యోగాన్ని ఇచ్చే పరిస్ధితులు లేనప్పుడు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన యోగకారక గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్నా యోగ ఫలాన్ని పొందవచ్చును. మొదటిసారిగా ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు సోమవారం రోజు గాని గురువారం రోజు గాని శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.     

4, ఆగస్టు 2018, శనివారం

జాతకచక్రంలో బాధక స్ధానాల సమగ్ర పరిశీలన

జాతకచక్రంలో బాధక స్ధానాల సమగ్ర పరిశీలన

భాదకులు:-చర లగ్నాలకు లాభాదిపతి భాదకుడు అవుతాడు.
స్ధిర లగ్నాలకు భాగ్యాదిపతి భాదకుడు అవుతాడు.
ద్విస్వభావ లగ్నాలకు సప్తమాధిపతి భాదకుడు అవుతాడు.

చరరాశుల రాశ్యాధిపతులు, ద్విస్వభావ రాశుల రాశ్యాదిపతులు, వాటి బాధక స్ధానాధిపతులు పరస్పర శత్రువులు కాబట్టి ఈ రాశుల్లో జన్మించిన వారికి బాధక రాశ్యాధిపతుల దశలు, అంతర్ధశలు యోగించకపోవటం గమనించవచ్చును. ఎటువంటి శుభగ్రహ ప్రభావం లేని బాధక గ్రహాలు తీవ్ర వ్యతిరేక ఫలాలను కల్పించటంతో పాటు మారక నిర్ణయంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. 

1, ఆగస్టు 2018, బుధవారం

జాతక చక్రంలో దుస్ధానాల పరిశీలన

జాతక చక్రంలో దుస్ధానాల పరిశీలన

జాతకంలో దుస్ధానాలలో ఉన్న గ్రహాలు ఇచ్చే శుభ, అశుభ ఫలాలను కూలంకషంగా పరిశీలించిన తరువాత మాత్రమే ఫలిత నిర్ణయం చేయవలసి ఉంటుంది. వివిధ జ్యోతిష్య ఫల గ్రంధాలన్నీ 6, 8, 12 స్ధానాలు దుస్ధానాలుగా చెప్పటం జరిగింది. భారతీయులు దుస్ధానాలుగా భావించే స్ధానాలకు కూడా శుభ ఫలాలను ఆపాదించటం జరిగింది. వీరు దుస్ధానాలు కూడా శుభ ఫలాలను ఇవ్వగలవని చెప్పటం జరిగింది.

21, జులై 2018, శనివారం

శనిగ్రహ దోష నివారణకు "సప్తముఖి రుద్రాక్ష"

శనిగ్రహ దోష నివారణకు "సప్తముఖి రుద్రాక్ష"

జాతకచక్రంలో శనిగ్రహ దోష నివారణకు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి. శరీరంలో తీసుకున్న పదార్ధం గాని, వాయువు గాని బయటకు పంపే విసర్జక వ్యవస్ధకు అధిపతి శని. ఇది పనిచేయకపోతే అన్నింటా బద్ధకమే అంతా అనారోగ్యమే. మలబద్దకానికి శని కారకుడు. అందుకే ఉదయాన్నే వాకింగ్ గాని, మేడిటేషన్ గాని చెయ్యాలి. మలబద్దక నివారణకు సప్తముఖి రుద్రాక్షను రాత్రి కాపర్ గ్లాస్ లో ఉంచి ఉదయాన్నే ఆ నీటిని త్రాగవలెను.

14, జులై 2018, శనివారం

గురు చండాల యోగ నివారణకు "ఏనుగు వెంట్రుక రింగ్ మరియు కంకణం"

గురు చండాల యోగ నివారణకు "ఏనుగు వెంట్రుక రింగ్ మరియు కంకణం"

జాతకంలో గురు, రాహువుల కలయిక వలన వచ్చే గురు చండాల యోగ నివారణకు ఏనుగు వెంట్రుకతో చేసిన రింగ్ ని గాని కడియాన్ని గాని ధరించవచ్చు. ఇవి ధరించటం వలన నరదృష్టి ప్రభావాల నుండి కూడా విముక్తి కలుగుతుంది. రింగ్ గాని, కడియం గాని మొదటి సారి ధరించే వారు గురువారం రోజు ఉదయం సూర్యోదయంలో గాని, ఆదివారం రాహు కాలం లో గాని ధరించటం వలన గురు చండాల యోగం వలన కలిగే చెడు ఫలితాల నుండి ఉపశమనం కలుగుతుంది.

13, జులై 2018, శుక్రవారం

శుక్ర గ్రహ దోష నివారణకు "షణ్ముఖి రుద్రాక్ష"

శుక్ర గ్రహ దోష నివారణకు "షణ్ముఖి రుద్రాక్ష" 

షణ్ముఖి రుద్రాక్ష ప్రత్యక్ష కుమారస్వామి [కార్తికేయ] రూపముగా భావిస్తారు. జ్యోతిష్యంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి. శుక్రుడు వివాహం, సౌఖ్యత కారకుడు. దాంపత్య జీవితంలో గొడవలు, సౌఖ్యత లేనివాళ్ళు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. వివాహం కాని స్త్రీ, పురుషులు షణ్ముఖి రుద్రాక్షను దరిస్తే వివాహం తొందరగా జరుగుతుంది.

7, జులై 2018, శనివారం

శనిగ్రహ దృష్టి దోష నివారణకు "కాల నజర్ బట్టు కవచం"























శనిగ్రహ దృష్టి దోష నివారణకు "కాల నజర్ బట్టు కవచం"  

శనిదృష్టి కలిగిన వారికి మొండితనం, అశ్రద్ధ, తరచుగా అనారోగ్యాలకు గురి కావటం, బద్ధకం, ఈ రోజు చేయవలసిన పనిని రేపటికి వాయదా వేయటం, చూపు మందగించటం జరుగుతుంది. జాతకంలో శని దృష్టి ఉన్న భావ ఫలితాలను తొందరగా పొందలేము. ఎంతో శ్రమ, ఓర్పుతో భావ ఫలితాలను పొందవలసి వస్తుంది. శనిగ్రహ దృష్టి నివారణకు "కాల నజర్ బట్టు" కవచాన్ని ధరించాలి. ఈ కవచాన్ని మొదటిసారి ధరించే వారు శనివారం ధరించటం మంచిది.

17, జూన్ 2018, ఆదివారం

వాస్తుదోష నివారణకు “సూర్య శంఖం”

వాస్తుదోష నివారణకు “సూర్య శంఖం”

ఇంటిలో గాని, ఆపీసుల్లో, వ్యాపారస్ధలంలో వాస్తు దోషాలు ఉన్నవారు సూర్య శంఖాన్ని పూజా మందిరంలో బియ్యం పైన ఉంచి ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని చదివిన వాస్తు దోష నివారణ జరుగుతుంది.

2, ఏప్రిల్ 2018, సోమవారం

జాతకచక్రంలో రోగ పరిశీలన

జాతకచక్రంలో రోగ పరిశీలన

జాతకంలో లగ్నా
ధిపతి, లగ్నభావం, షష్టాధిపతి, షష్ఠ బావంతో సంబందం ఉన్నయెడల జాతకునికి రోగాలు అడపాదడపా పీడిస్తాయని, ఒక రోగం తరువాత ఇంకో రోగం పీడిస్తూనే ఉంటుంది. వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేసి నయం చేయడం కన్న వ్యాధి రాకుండా చేసుకోవటమే మేలు అని జ్యోతిర్వైద్యం చెబుతున్నది.

28, మార్చి 2018, బుధవారం

రాహు, కేతు దోష నివారణకు “సులేమని స్టోన్”

రాహు, కేతు దోష నివారణకు “సులేమని స్టోన్” 

సులేమని స్టోన్ నే “ఈవిల్ ఐ స్టోన్” అని, నరదృష్టి స్టోన్ అని పిలుస్తారు. సులేమని స్టోన్ ముఖ్యంగా రాహు కేతువుల యొక్క చెడు ప్రభావాలను తొలగించటానికి ఉపయోగిస్తారు. సులేమని స్టోన్ నలుపు వర్ణం కలిగి తెల్ల చారలు కలిగి ఉంటుంది. ఇతర వర్ణాలలో కూడా సులేమాన్ లభించిన నలుపు వర్ణంతో కలసిన తెలుపు చారలు ఉన్న దానికే ఎక్కువ ప్రాదాన్యత కలిగి ఉంది. 

21, మార్చి 2018, బుధవారం

అతి ముఖ్యమైన ప్రయాణములకు పరిఘాదండ చక్ర ప్రాముఖ్యత

అతి ముఖ్యమైన ప్రయాణములకు పరిఘాదండ చక్ర ప్రాముఖ్యత

పూర్వ కాలామృతం గ్రంధం నందు ముఖ్యమైన ప్రయాణములు చేయు వారు పరిఘాదండ చక్రం పరిశీలించి ఆయా నక్షత్రములు తెలిజేయు దిక్కు నందు ఆ రోజు ప్రయాణం చేయకూడదని తెలియజేయబడినది. అలా చేసిన కార్యసఫలత పొందలేరని తెలియజేయడమైనది.


శ్లోకం:-ఆగ్నేయానిలకోణయోచ్చ విలిఖేడే కాంచ రేఖాం చతు
ష్కోణే ప్రాగ్లిఖితే ప్రసిద్ధ పరిఘా దండాఖ్య చక్రే శుభే
తత్ప్రాగాదిషు సప్త సప్త గమనే వహ్న్యదితారా లిఖే
దష్టా వింశతి సంఖ్యయైవ పరిఘాదండో నలంఘ్యేధ్వగై

ఆగ్నేయం దిక్కు నుండి వాయువ్య దిక్కుకు ఒక రేఖ గీయవలెను, ఈశాన్యం దిక్కు నుండి నైరుతి దిక్కుకు మొదటి రేఖను ఖండిస్తూ ఒక రేఖ గీయవలెను. అభిజిత్ నక్షత్రంతో కలిపి 28 నక్షత్రాలను నాలుగు దిక్కులకు వ్రాయవలెను.

కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు తూర్పు దిక్కును,

మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ నక్షత్రాలు దక్షిణ దిక్కును,

అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, అబిజిత్, శ్రవణం నక్షత్రాలు పడమర దిక్కును,

ధనిష్ఠ, శతబిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని, భరణి నక్షత్రాలు ఉత్తరం దిక్కును తెలియజేస్తాయి.

ఆయా దిక్కు నందు ఉండు నక్షత్రముల యందు ఆయా దిక్కులకు ప్రయాణం కూడదని కార్య సఫలత పొందలేరని పూర్వ కాలామృతం గ్రంధం నందు తెలియజేయడమైనది.

3, మార్చి 2018, శనివారం

నవగ్రహ దోష నివారణకు తినవలసిన దానం చేయాల్సిన వస్తువులు

నవగ్రహ దోష నివారణకు తినవలసిన దానం చేయాల్సిన వస్తువులు

నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఆయా గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలను తినటం వలన గ్రహాలకు సంబందించిన దోషాలు నివారించవచ్చును. తరువాత పూజా సంబందిత కార్యక్రమాలు, దాన ధర్మాలు చేయటం ద్వారా దోషాలను నివారించవచ్చును. జాతకంలో గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్న, నీచలో ఉన్న, అస్తంగత్వ ప్రభావంలో ఉన్న, పాపార్గళంలో ఉన్న, గ్రహం ఉన్న రాశిలో తక్కువ అష్టకవర్గు బిందువులు ఉన్న, గ్రహాలకు సంబందించిన దశాంతర్ధశల యందు, గోచార నందు ఆయా గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలు తినటం ద్వారా అవి మన శరీరానికి పట్టి ఆయా గ్రహాలు ఇచ్చు దోష ఫలితాలను నివారించవచ్చును. గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలను మన శరీరానికి తీసుకున్న తరువాత పూజా పూజలు, వ్రతాలు, యఙ్ఞాలు, దాన ధర్మాలు మొదలగు కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చును. 

27, ఫిబ్రవరి 2018, మంగళవారం

జలతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

జలతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు 

జలతత్వ రాశులు :- కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారు జలతత్వ రాశులకు చెందినవారు. అధిపతులు వరుసగా చంద్రుడు, కుజుడు, గురువు.  జలతత్వ రాశుల వారు ఆవేశపరులు, చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందటం, కష్ట సుఖాలు, సంపదలను గూర్చి ఎక్కువగా ఊహించుకోవటం. బార్యా పిల్లలతో ఎక్కువ ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. పరిసరాలకు ఆనుగుణంగా లోబడి ప్రవర్తిస్తారు. 

23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

వాయుతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

వాయుతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

వాయుతత్వ రాశులు:- మిధునం, తుల, కుంభ రాశుల వారు వాయుతత్వానికి చెందినవారు. వాయుతత్వ రాశుల వారు ఆలోచనల మీద, ప్రణాళికల మీద, పధకములు వేయుట యందు గడుపుదురు. తెలివితేటలు, సామర్ధ్యంపై విశ్వాసం ఎక్కువ. సాంఘిక కార్యక్రమముల యందు కొత్త
ధకాలు తయారు చేయుట, అనేక మందిని (స్నేహితులను, అధికారులను) కలుపుకొనిపోవుట. కొత్త విషయాలు తెలుసుకొనుట, కొత్త ప్రదేశాలు దర్శించుట వీరి అభిరుచులు. కష్టించి పని చేయటం కష్టం. మానవ జాతికి ఉపకరించు ఏ కార్యక్రమమైన వీరు చేపడతారు. నిస్వార్ధత, మానవ శ్రేయస్సు వీరి యందుండు లక్షణాలు. 

22, ఫిబ్రవరి 2018, గురువారం

భూతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

భూతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

భూతత్వరాశులు:- వృషభం, కన్య, మకర రాశులు భూతత్వానికి చెందినవి. వీటికి వరుసగా శుక్ర, బుధ, శని అధిపతులు. భూతత్వరాశుల వారు మంచి దృడమైన శరీరం కలిగి ఉంటారు. మంచి భోజన ప్రియులు. కూడబెట్టుట, ఏదైనా పనిని ప్రారంభించే ముందు లాభ నష్టములను బేరీజు వేసుకొని ప్రవర్తించెదరు. వ్యక్తిగత విషయాల యందు, ఊహా జగత్తుల యందు విహరించుట. బౌతిక విషయాల యందు, జీవనం నందు విశ్వాసం ఉండును. ఏదైనా పనిని ప్రారంభించిన వదిలిపెట్టరు. వీటిని అర్ధ త్రికోణ రాశులు అని కూడ అంటారు. మంచి జీవనోపాధి కలిగి ఉంటారు. 

21, ఫిబ్రవరి 2018, బుధవారం

వధూవరుల వివాహ విషయంలో జన్మ నక్షత్ర, నామ నక్షత్ర ప్రాధాన్యత

వధూవరుల వివాహ విషయంలో జన్మ నక్షత్ర, నామ నక్షత్ర ప్రాధాన్యత

జాతకాలు చూపించి వివాహం చేసినా లేదా చూపించ కుండా వివాహం చేసినా మనకు బ్రహ్మ లిఖితం ప్రకారం రాసి పెట్టి ఉన్న అమ్మాయి, అబ్బాయిలకే వివాహం అవుతుంది. జాతకాలు చూడడం అనే టెక్నాలజీ ద్వారా మనం ప్రతి సంబంధం గురించి వెంట పడకుండా ఉండటం కోసమే ఈ విధానం చెప్పారు. జాతకాలు చూపించాం కదా అని అవగాహనా లోపాలు, విడాకులు వంటి దోషాలు సమసిపోవు.

అగ్నితత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

అగ్నితత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

అగ్నితత్వ రాశులు :- మేషం, సింహాం, ధనస్సు రాశుల వారు అగ్నితత్వానికి చెందినవారు. వీటికి వరుసగా అధిపతులైన కుజ, సూర్య, గురువు అగ్నితత్వం కలిగి ఉంటారు. అగ్నితత్వ రాశుల వారు ఉష్ణ తత్వం కలిగి కోప స్వభావాలు కలిగిఉంటారు. అగ్నితత్వం కావటం వలన వికాసం, శక్తి సామర్ధ్యాలు, చైతన్యం, ప్రేరణ, సాహసం, పౌరుషం, కోపం మొదలగు లక్షణాలు కలిగి ఉంటారు. న్యాయకత్వం, దైర్యసాహసాలు, శత్రువులపైన విజయాలు.

20, ఫిబ్రవరి 2018, మంగళవారం

హతాజోడి

హతాజోడి
           హతాజోడికి హత్ జోడి, హతాజోరి, హస్తజోడి, హత్తాజోడి అని పిలుస్తారు. హతాజోడి మడచిన చేతుల ఆకారంలో వున్న చాలా అరుదైన మొక్క యొక్క వేరు(మూలం). ఈ మొక్క ముఖ్యంగా మధ్యప్రదేశ్ లోని ‘అమర్ కంటక్’ కొండలలోను మరియు నేపాల్ ‘లుంబిని లోయలో’ను ఎక్కువగా కనబడుతుంది. దట్టమైన పర్వత శ్రేణులు, నదులు ఉన్న ప్రాంతంలో ఈ మొక్కలు సమృద్ధిగా లభిస్తాయి. మధ్య ప్రదేశ్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారి ప్రకారం ఈ మొక్క నీలం రంగుతో తెల్లని పుష్పాలను కలిగి ఉంటుంది. ఇది ఉమ్మెత్త మొక్కను పోలి ఉంటుంది. 

చర, స్ధిర, ద్విస్వభావ రాశుల వారి స్వభావాలు

చర, స్ధిర, ద్విస్వభావ రాశుల వారి స్వభావాలు

మేషం, కర్కాటకం, తుల, మకర రాశులు చర రాశులు.
వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులు స్ధిర రాశులు.
మిధునం, కన్య, ధనస్సు, మీనం రాశులు ద్విస్వభావ రాశులు.

10, ఫిబ్రవరి 2018, శనివారం

నర్మదా బాణలింగం

నర్మదా బాణలింగం 

పురాణాల ప్రకారం నర్మద శివాంశసంభూతురాలని, చంద్రవంశ రాజుకు భార్య అయి నందున ‘సోమోద్భవ’ అని, నాగులకు గంధర్వుల బాధ తొలగించి నందున "నాగకన్య" అని కొన్ని పేర్లతో పిలవబడుతుంది. నాగులకు ఉపకారం చేసినందులకు నర్మద యందలి లభించు బాణ లింగాలకు అభిషేకం చేసిన జలాలు సేవించిన వారికి కాలసర్ప విష భయం ఉండదని నాగులు వరమిచ్చారు. ఈనర్మదా బాణలింగ అభిషేక జలం త్రిదోషహరం, వీర్యవృద్ధి కరం, ఆరోగ్యకరం, రుచికరమని ఆయుర్వేద గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. నర్మదా లింగాన్ని చూచినంత మాత్రముననే కాలసర్పదోషాలు, నాగదోషాలు, సమస్త పాపములు నశించునని పురాణములు ప్రకారం నాగదేవతలు వరం ప్రసాదిస్తున్నవి. 

9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

స్పటిక శివలింగం

స్పటిక శివలింగం 

స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. శివుని శరీరము “ శుద్ధస్ఫటిక సంకాశం ” అని కీర్తింపబడింది. సాక్షాత్తు శివ స్వరూపమైన స్ఫటిక లింగాన్ని ఆరాధించి సేవిస్తే ముక్తి లభిస్తుందని శాస్త్రాలలో పేర్కొనబడింది. శివారాధన వికల్పాలలో విభిన్న వ్యక్తులు విభిన్న శివలింగాలని మాత్రమే పూజించాలని పురాణాలలో ప్రతిపాదిస్తూ స్పటిక లింగాన్ని మాత్రం స్త్రీ పురుష భేదం లేకుండా అందరు సేవించి పరమపదమును పొందవచ్చునని నిరూపింపబడింది. 

8, ఫిబ్రవరి 2018, గురువారం

పాదరస లింగం

పాదరస లింగం విశిష్టత

పాదరస లింగాన్ని పూజా మందిరంలో ఉంచి పూజించవలెను. మహాశివరాత్రి, కార్తీక మాసం  రోజు ఈ లింగాన్ని పూజిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
శ్లో!! వైద్యాయ రసలింగం యో భక్తియుక్తస్సమర్పయేత్!
జగత్రయేపి లింగానాం పూజాఫలమవాప్నుయాత్!!

   ‘పారదలింగ’మనగా పాదరస లింగము. దీనిని యింకా ‘రసలింగ’మనియు, ‘తేజోలింగ’ మనియు చెప్పుదురు. వేదపరముగా పాదరసము ‘శివుని బీజము’ నుండి వచ్చినదని చెప్పబడినది. ఈలింగము చాలా స్వచ్ఛమైనది, శుభకరమైనది. బ్రహ్మపురాణమునందు "పాదరసలింగము’ను సేవించిన ప్రపంచ పరమార్థముల నొందుటయే గాక, ముక్తిని పొందుదురని చెప్పబడినది. బ్రహ్మహత్యాపాతకము కూడా నశించునని దీనిని పూజా గృహము నందు ఎర్రని వస్త్రం పైన ఉంచి పూజించవలెనని చెప్పబడింది. పాదరసమును ఆయుర్వేద శాస్త్రరీత్యా కుందనపు రేకులు, నిమ్మపండు రసంతో స్వేదనం చేసి ఘనీభవింపజేసి లింగరూపముగా చేయుదురు. 

30, జనవరి 2018, మంగళవారం

కుజ, శుక్రుల సంయోగ దోష నివారణకు “తెల్ల పగడం”

కుజ, శుక్రుల సంయోగ దోష నివారణకు “తెల్ల పగడం” 

జాతక చక్రంలో కుజ, శుక్రులు కలసి 10 డిగ్రీల లోపు ఉన్నప్పుడు వారిద్దరి మధ్య సంయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా కుజ, శుక్రుల కలయిక జీవితంలో వైవాహిక జీవితంపైన, సంసార జీవితంపైన ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. చెడు గ్రహ ప్రభావం వలన కామ కోరికలు అధికంగా కలగి ఉండటం, లైంగిక సమస్యలు కలిగి ఉండటం జరుగుతుంది. 

కుజ, శుక్రుల సంయోగ దోషాన్ని నివారించటానికి, వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగిపోవటానికి తెల్ల పగడం చేతికి ధరించటం గాని, లాకెట్ గా మెడకు ధరించటం గాని చేయటం మంచిది. తెల్ల పగడాన్ని కుడి చేతికి గాని, ఎడమ చేతికి గాని ధరించ వచ్చును. చూపుడు వ్రేలు లేదా ఉంగరపు వ్రేలు లేదా మద్య వ్రేలుకు ధరించవచ్చును. 5 క్యారేట్స్ నుండి 10 క్యారేట్స్ వరకు ధరించవచ్చును. తెల్ల పగడాన్ని ధరించటానికి ముందు కొబ్బరి పాలలో వారం రోజుల పాటు ఉంచి ధరించటం మంచిది.   

బాలారిష్ట దోషాలను రూపుమాపే శ్వేతార్క ఆంజనేయ స్వామి

బాలారిష్ట దోషాలను రూపుమాపే శ్వేతార్క ఆంజనేయ స్వామి

జన్మ లగ్నము నుండి అష్టమంలో చంద్రుడు వున్ననూ, కుజుడు సప్తమంలో వున్ననూ, రాహువు నవమంలో వున్ననూ, జన్మంలో శని వున్ననూ, గురువు తృతీయంలో వున్ననూ, రవి పంచమంలో వున్ననూ, శుక్రుడు ఆరవ యింట వున్ననూ, బుధుడు చతుర్ధంలో వున్ననూ, కేతువు వ్యయంలో వున్ననూ బాలారిష్టములుగా చెబుతారు.

27, జనవరి 2018, శనివారం

డోలన విద్య (Dowsing Pendulum)

డోలన విద్య (Dowsing Pendulum)
డౌజింగ్ పెండ్యూలమ్ అనగా డోలన విద్య అంటారు. ఈ డోలనవిద్య అత్యంత అరుదైనది మరియు క్లిష్టమైనది. పెండ్యులాన్ని డోలకం అని కూడా అంటారు. డోలకాన్ని మూడు భాగాలుగా విభజించ వచ్చును. 1)పెండ్యూలమ్ పైన దారంతో కట్టబడి ఉండటం. 2)డోలకం మద్య భాగం చివర ఉండే కొన కంటే లావుగా ఉండటం. 3)డోలకం చివర సన్నగా ఉండటం. డోలకాన్ని వెండి, ఇత్తడి, రాగి, కర్ర, స్పటికం ఇంకా అనేక రకాలుగా తయారుచేస్తారు.

23, జనవరి 2018, మంగళవారం

బుధగ్రహ దోష నివారణకు బ్యాంబు ట్రీ (వెదురు చెట్టు)

బుధగ్రహ దోష నివారణకు బ్యాంబు ట్రీ (వెదురు చెట్టు)

బ్యాంబుట్రీ దీనినే వెదురు చెట్టు అని కూడ అంటారు. ఇది ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. ఇది మన నవగ్రహాలలో బుధ గ్రహానికి చెందినది. బుధుడు వ్యాపారవృద్ధి కారకుడు కావటం వలన ఇది వ్యాపార సంస్థలలో ఉంచితే వ్యాపారం దిన దినాభివృథ్ధి చెందుతుంది. వ్యాపార సంస్థలలో నరథిష్టికి, ఆకర్షణకు, వ్యాపారభివృథ్థికి చాలా మంచిది.విద్యకి, వాక్ శుద్ధికి బుధుడు కారకుడు. పిల్లలు చదువుకునే టేబుల్ దగ్గర ఉంచితే మంచి తెలివితేటలు, చదువుపై శ్రద్ద, సరియైన సమయంలో (పరీక్ష సమయములలో) గుర్తుకు వచ్చే ఆలోచనలు (క్రియేటివిటి). మంచి వాక్ ఫటిమ కలిగి భావ ప్రకటన చేయగలడు. వెదురు మొక్క పెరుగుదలను ప్రత్యక్షంగా చూడటం వలన మనలో కూడ జీవితంలో ఉన్నత స్ధాయికి ఎదగాలనే భావన కలుగుతుంది.

22, జనవరి 2018, సోమవారం

సూర్యభగవానుడి దోష నివారణకు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన

సూర్యభగవానుడి దోష నివారణకు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన  

జాతకంలో రవి నీచలో (తులారాశిలో) ఉండి ఎటువంటి శుభ గ్రహ ద్రుష్టి లేకుండా ఉంటే అనారోగ్య సమస్యలు, ఎదుటి వారిని లెక్కచేయకపోవటం, ప్రతి ఒక్కరు తనమాటే వినాలనుకోవటం, తన అడుగు జాడలలో నడవాలనుకోవటం వంటి స్వార్ధ భావాలు కలిగి ఉంటారు. ఇలాంటి వారు ఆదివారం రోజు సూర్యోదయం నుండి ఒక గంట లోపు తెల్లజిల్లేడు వత్తులతో దీపం వెలిగించి ఆదిత్య హృదయ పారాయణ చేయటం వలన రవి నీచలో ఉండటం వలన కలుగు దోషాలు తొలగిపోతాయి.

19, జనవరి 2018, శుక్రవారం

సరస్వతి రుధ్రాక్ష కవచం

సరస్వతి రుధ్రాక్ష కవచం


        సరస్వతి రుద్రాక్ష కవచాన్ని సోమవారం రోజు గాని, బుధ వారం రోజు గాని, గురు వారం రోజు గాని, శుక్ర వారం రోజు గాని, వసంత పంచమి రోజు గాని మరియు విశిష్టమైన రోజులలో శివాలయంలో అభిషేకం చేయించటం గాని సరస్వతి ఆలయంలో పూజ చేపించటం గాని చేసి శివ పంచాక్షరి
మంత్రాన్ని లేదా సరస్వతి మంత్రాన్ని చదువుతూ మెడలో గాని చేతికి గాని ధరించటం వలన విద్యా సంబంధ విషయాలలోను, చదువులో ఆటంకాలను తొలగిస్తుంది. సిగ్గు, బిడియం లేకుండా అనర్గళంగా మాట్లాడే సామర్ధ్యాన్ని కలిగిస్తుంది. చదువులో అశ్రద్ధ లేకుండా బాధ్యతగా చదువుపై ఆసక్తిని కలిగిస్తుంది. సరస్వతి రుద్రాక్ష కవచం విధ్యాభివృధ్దికి, ఉన్నత విద్యను అభ్యసించటానికి చాలా మంచిది. సరస్వతి రుద్రాక్ష కవచంలో చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి (4, 5, 6) రుధ్రాక్షలు ఉంటాయి. శుభ గ్రహాలైన బుధ, గురు, శుక్ర గ్రహ దోషాలను సరస్వతి రుద్రాక్ష ధరించటం వలన నివారించవచ్చును. 

11, జనవరి 2018, గురువారం

హస్తరేఖలలోని వివాహ రేఖల రహస్యాలు

హస్తరేఖలలోని వివాహ రేఖల రహస్యాలు  

వివాహరేఖలనే కళ్యాణ రేఖలని, పరిణయ రేఖలని, ప్రేమ రేఖలని, దాంపత్య రేఖలని అంటారు. అరచేతిలో చిటికిన వ్రేలు క్రింద బుధ స్ధానంలో ప్రేమకు ప్రతిరూపమైన ఆత్మరేఖకు పై భాగంలో అంచున ప్రారంభమై బుధ స్ధానంలో  ఏర్పడి ఉండే చిన్న రేఖలను వివాహరేఖలు అంటారు. మరియు వివాహ యోగ్యత రేఖలు అంటారు. 

10, జనవరి 2018, బుధవారం

గురు చండాల యోగ విశ్లేషణ

గురు చండాల యోగ విశ్లేషణ 

గురు, రాహువుల కలయికను గురు, రాహు దోషం అని, కేంద్ర స్ధానాలైన 1, 4, 7, 10 బావాలలో గురు, రాహువులు కలసినప్పుడు దానిని గురు చండాలయోగం గాను పిలుస్తారు. మిగతా స్ధానాలలో కంటే కేంద్ర భావాలలో రాహు, గురుల కలయిక ఎక్కువ పాప ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే కేంద్ర స్ధానాలలో పాపగ్రహాలు పాప ఫలితాలను, శుభ గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తాయి. అయితే గురు, రాహువులు 10 డిగ్రీల లోపు ఉంటేనే వారి ఇద్దరి మధ్య సంయోగం ఏర్పడి గురు చండాల యోగ ఫలితాలను పొందుతారు. గురు, రాహువుల మధ్య 10 డిగ్రీల కంటే ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు గురు, రాహువులు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలను గురు చండాల యోగ ఫలితాలను ఇవ్వలేరు.   

8, జనవరి 2018, సోమవారం

వాస్తు ఐశ్వర్య కాళీ పాదం

వాస్తు ఐశ్వర్య కాళీ పాదం

వాస్తు ఐశ్వర్య కాళీ యంత్ర పోస్టర్ ను ఇళ్ళు లేదా షాపు లేదా ఆఫీసు ప్రదాన ద్వారానికి లోపలి వైపు పైభాగాన ఉంచి "ఓం ఇం క్లీం ఐశ్వర్య కాళేయ నమః" అనే మంత్రాన్ని నిత్యం పఠించటం వల్ల వాస్తు దోషాలు పోయి ధనాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, విద్యలో రాణింపు, మంచి ఉద్యోగం లభించటమే కాకుండా
వాస్తు ఐశ్వర్య కాళీ పాదం ఉన్నచోట నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...