25, సెప్టెంబర్ 2016, ఆదివారం

మణి చక్రం



మణి చక్రం
        మణి చక్రం అంటే ప్రార్ధనా చక్రం. ఈ ప్రార్ధనా చక్రాన్ని ఇంటిలో తూర్పు దిక్కున పూజా మందిరంలో గాని, హాలులో గాని ఉంచిన అన్ని ప్రమాదాల నుండి రక్షించి అదృష్టం కలసి వస్తుంది. మణి చక్రం దగ్గర కూర్చొని ఓం మణి పద్మే హం అనే మాత్రాన్ని జపిస్తూ ఉంటే ఆరోగ్యాన్ని, వాక్శుద్దిని కల్పించి, జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. దృష్టి దోషాలను తొలగిస్తుంది. మణి చక్రాన్ని వాహన ప్రమాదాల నుండి రక్షణ పొందటానికి వాహనాల వారు కూడా ఉపయోగించవచ్చు. తరచుగా వాహన ప్రమాదాలు జరుగుతున్నవారు, వాహనల రిపేర్ లు ఎక్కువగా ఉన్నవారు మణిచక్రాన్ని డాష్ బోర్డ్ పైన ఉంచిన వాహన ప్రమాదాలు, రిపేర్లు ఉండవు. 

ముంగీస



ముంగీస
     ముంగీస అతి తెలివితేటలకు, సూక్ష్మ పరిశీలనకు పెట్టింది పేరు. కుటుంబంలో కలహాలు లేకుండా చేస్తుంది. దారుణమైన ప్రత్యర్ధలు  పాము ముంగీసలు. కాబట్టి ముంగీసను ఇంట్లో ఉంచిన సర్పదోషాలు ఉన్నవారికి  సర్ప దోషాలను పోగొడుతుంది. నైరుతి దిక్కున ఉంచిన దోషాలు పోగొడుతుంది. జాతకచక్రంలో కాలసర్పదోషాలు, నాగదోషాలు, కుజ దోషాలు ఉన్నవారు ముంగీసను నైరుతి దిక్కున ఉంచిన దోష నివారణ కలుగును. పాము కలలు, చెడు కలలు ఎదుర్కొంటున్నవారు ముంగీసను బెడ్ రూంలో నైరుతి దిక్కున ఉంచిన చెడుకలల నుండి విముక్తి కలుగుతుంది.

కూర్మ ప్రతిష్ట శ్రీయంత్రం



కూర్మ ప్రతిష్ట శ్రీయంత్రం
         కూర్మ ప్రతిష్ట శ్రీయంత్రం అత్యంత శక్తి వంతమైన యంత్రాలలో ఒకటి. కూర్మ ప్రతిష్ట శ్రీయంత్రం పూజ చేసిన సామాన్యులను సైతం సౌభాగ్య వంతులను చేస్తుంది. ఈ భూమిని జలములలో మునిగి పోకుండా తన వీపుపై ధరించి, ఉద్దరించిన విష్ణుదేవుని అవతారమే కూర్మ స్వరూపము. దేవతలచేత అసురుల చేత అమృతానికై సాగరాన్ని చిలికిస్తూ వారందరి చేత కవ్వ రూపంలో ఉండే మందర పర్వతాన్ని ధరించడం కోసం తానే కూర్మ రూపాన్ని ధరించి తన పుష్టంపై ధరించాడు.
       కూర్మ పుష్టం పైన ఉన్న మందర పర్వతాన్ని అవిశ్రాంతంగా మదిస్తుంటే నాలుదిక్కుల వెలుగులను నింపుతూ పద్మంలో కూర్చొని, చేతిలో పద్మాన్ని ధరించి లక్ష్మీదేవి ఆవిర్బవించింది. ఈ లక్ష్మీ సంపదలన్నిటికి ప్రతీక. లక్ష్మీదేవి ఆవిర్భావం తరువాతనే దేవతలకు సకల ఐశ్వర్యాలు కలిగాయి. ఈ విధంగా కూర్మపుష్టం పైన ఆవిర్బవించిన లక్ష్మీదేవి ప్రతిరూపమైన కూర్మ ప్రతిష్ట శ్రీయంత్రాన్ని పూజించిన వారికి సకల ఐశ్వర్యాలు, భూసంపద, ధాన్య, వస్తు సంపద కలుగుతాయి.

కూర్మ పుష్ట పిరమిడ్



కూర్మ పుష్ట పిరమిడ్
కూర్మ పుష్ట పిరమిడ్ ఉత్తర దిక్కుకి ఆదిపతి అయిన కుబేర స్ధానంలో
ప్రతిష్ఠించిన కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది. కూర్మ పిరమిడ్ ను ఇంట్లో ఉత్తరదిక్కున ప్రతిష్ఠించిన వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో గాని, వ్యాపార స్ధలంలో గాని ఉత్తర దిక్కున లోపలకు వచ్చేటట్టు ఉంచాలి. వాస్తు దోషాలు పోవటానికి ఓం నమో భగవతే కూర్మ దేవాయ అనే మంత్రంతో భూమి లోపల ఉత్తర దిక్కున ప్రతిష్టించిన వాస్తు దోష నివారణ కలగటమే కాకుండా, నరదృష్టి నివారణ, వ్యాపారాభివృద్ధి, ధనాభివృద్ధి, జ్ఞానాభివృద్ధి కలుగుతాయి.

24, సెప్టెంబర్ 2016, శనివారం

హాకీక్ స్టోన్స్ (Hakeek Stones)

హాకీక్ స్టోన్స్


             తంత్ర శాస్త్రంలో హాకీక్ స్టోన్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి. హాకీక్ స్టోన్స్ చాలా తక్కువ రకు లభ్యమవుతాయి. ఇవి కూడా రత్నాల మాదిరిగానే దొరుకుతాయి. ఆధ్యాత్మిక పర్వతాల నీడలో హాకీక్ పర్వతాలు ఉంటాయి. ఈ స్టోన్స్ టర్కీ, ఇరాన్ దేశాలలో అత్యధికంగా దొరుకుతాయి. ఇవి ముస్లింలు పవిత్రమైన రాయిగా పురాతన కాలం నుండి ధరిస్తున్నారు. హాకీక్ స్టోన్స్ పాలిష్ చేసినట్లుగా మెరుస్తూ ఉంటుంది. హాకీక్ స్టోన్స్ సూర్య కిరణాలను గ్రహించి పరావర్తనం ద్వారా కాంతి మన శరీరానికి ప్రసరింపజేస్తాయి. హాకీక్ స్టోన్స్ రెడ్, ఎల్లో, ఆరెంజ్, క్రీమ్, గ్రీన్, బ్లాగ్, గ్రే, వైట్ కలర్స్ లో లభ్యమవుతాయి.

జాతకకర్మ



జాతకకర్మ

శిశువు జన్మించిన వార్త వినగానే జాతక కర్మ చేయాలని ధర్మ శాస్త్ర వచనాలు చెబుతున్నాయి. అదికూడ నాభిచ్చేదనానికి ముందే జరగవలెనట. నాభిచ్చేధం తరువాత తండ్రికి జాతాశౌచం ప్రారంభమవుతుంది. కనుక అంతకుముందే  జాతకకర్మ తండ్రి నిర్వహించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఆడ శిశువుకైన మగశిశువుకైన జన్మించిన వెంటనే జాతకకర్మ చేసే ఈ పద్ధతిలో తిధి వార నక్షత్రాలతో గాని ముహూర్త బలంతో గాని సంబంధం లేదన్న మాట. ఏ కారణం చేతనైన అప్పుడు జాతకర్మ కుదరకపోతే ఆ తరువాత చేయవలసినప్పుడు మాత్రం తిధి వార నక్షత్రాదులను చూసి ముహూర్తం నిర్ణయించవలెను. 

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవ జీవితముపై శుక్ర గ్రహ ప్రభావ విశ్లేషణ

జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవ జీవితముపై శుక్ర గ్రహ ప్రభావ విశ్లేషణ

మానవ జీవితముపై శుక్ర గ్రహ ప్రభావము కీలకమైనది.ఎవరైనా జీవితములో సుఖపడాలని కోరుకుంటారు. కనీస అవసరాలైన తిండి, వస్త్రములు ఉండడానికి ఓఇల్లు, వంటివి శుక్రగ్రహ అనుకూల బలం జాతకములో ఉండాలి. కనీస అవసరాలనుండి రాజయోగ సమానమైన జీవన శై లికి అలాంటి జీవితాన్ని అనుభవించడానికి బహువిథాలుగా సుఖపడడానికి శుక్రగ్రహ బలమే కారణము. రాజభోగాలు అనుభవించడానికి అవసరమైన థనము, హోదా, ఇతరత్రా అన్నిస్థితులూ జాతకునికి ఉండవచ్చు.ఉండడం వేరు.అనుభవించడం వేరు.అన్నీ ఉన్నవాళ్ళు సౌఖ్యాన్నిఅనుభవిస్తున్నారా?.అంటే లేదు. కోటీశ్వరులై ఉండి చద్దికూడు తిని చాపమీద పడుకునే వాళ్ళున్నారు. ఉండి కూడా అనుభవించలేని స్థితి. పిసినారితనం శుక్ర గ్రహ వ్యతిరేక ప్రభావం వల్లనే ఏర్పడుతుంది. వాళ్ళు తినరు ఇంకొకళ్ళకు పెట్టరు. రాజభవనము లాంటి భవంతి ఉండి లైట్లన్నీ ఆర్పివేసి చిన్న బల్బుతో కాలక్షేపము చేస్తారు. ప్రొద్దున వండిన అన్నాన్ని కాస్త వేడిచేసి తిని రాత్రిపూట భోజనము అయిందనిపిస్తారు.

8, సెప్టెంబర్ 2016, గురువారం

ద్వాదశాంశ వర్గ చక్ర విశ్లేషణ



ద్వాదశాంశ వర్గ చక్ర విశ్లేషణ

రాశిచక్రంలో ఒక్కొక్కరాశిని 12 భాగాలు చేయగా వచ్చు ఒక్కొక్క భాగమును ద్వాదశాంశ అంటారు. ద్వాదశాంశ ప్రమాణం 2°- 30' నిమిషాలు. మొత్తం 144 ద్వాదశాంశలు ఉంటాయి. ఏ రాశికి ఆ రాశి నుండే గణన ప్రారంభమవుతుంది. ద్వాదశాంశ ద్వారా తల్లి తండ్రులకు సంబందించిన విషయాలు, తల్లిదండ్రుల మధ్య వ్యత్యాసాలు, వారి కారకత్వాలను తెలియజేస్తుంది. వంశ వృక్షాన్ని సూచిస్తుంది. తల్లిదండ్రులతో వ్యక్తి సంబంధాలు ఎలా ఉంటాయో సూచించును. వంశపారంపర్య వ్యాధులు, తల్లిదండ్రుల క్షేమ సమాచారం, తల్లిదండ్రుల కష్టాలు, మరణాలకు సంబందించిన కారణాలు తెలుసుకోవచ్చును. క్రితం జన్మ మరియు రాబోవు జన్మ స్మృతులను, జ్ఞాపకాలను తెలుసుకోవటం లేదా గుర్తుకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. 

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...