15, జులై 2016, శుక్రవారం

మాణిక్యం (కెంపు)

మాణిక్యం (కెంపు)

         మాణిక్యం స్పటిక ఆమ్ల జాతికి చెందిన రత్నం. అత్యంత విలువైన ఈ రత్నాన్ని పద్మరాగమణి, మాణిక్యం, కెంపు అని కూడా అంటారు. మాణిక్యమణిని సూర్యగ్రహానికి ప్రతిరూపంగా చెబుతారు. బృహత్సంహితలో మాణిక్యమణి మూడు రకాలుగా లభిస్తుందని తెలియజేయబడింది. గంధకం, కురువిందం, స్పటికాలలో ఉద్భవిస్తుందని చెప్పబడింది. గంధకం నుండి పుట్టినవి పెళుసుగాను, కురువిందం నుండి పుట్టినవి కాంతిహీనంగాను, స్పటికం నుండి పుట్టినవి స్వచ్చంగా, కాంతివంతంగా ఉంటాయని చెప్పటం జరిగింది. మాణిక్యమణిని అత్యదిక వేడి వద్ద వేడి చేసినను ఆకుపచ్చరంగులోకి మారి చల్లారిన తరువాత సహజ సిద్ధమైన రంగులోకి మారుతాయి. రత్నపరీక్ష గ్రంధం ఆదారంగా మనకు ప్రకృతిలో ఆరు రకాల కెంపులు లభ్యమవుతాయి.

గోవింద సాలగ్రామం

 గోవింద సాలగ్రామం
 
గోవింద సాలగ్రామం బూడిద వర్ణం లేదా నలుపు వర్ణం కలిగి అండాకృతి రూపం కలగి ఉర్ద్వ ముఖం నందు నామాకృతి కలిగి ఉన్న గోవింద సాలగ్రామం అనబడును. గోవింద సాలగ్రామాన్ని “ఓం గోవిందాయ విద్మహే గోపి వల్లభాయ ధీమహీ తన్నో కృష్ణ ప్రచోదయాత్” అనే మంత్రంతో పూజాచేసిన వారికి పశు సంపద, భూసంపద, ధన దాన్యాదులు పుష్కలంగా ఉండును. రియల్ ఎస్టేట్ వారు పూజించిన ఊహించని దనాభివృద్ధి కలుగుతుంది. గోవింద సాలగ్రామం ఉన్న ఆర్ధిక పురోగతి కల్పిస్తుంది. గోవింద సాలగ్రామం చూసిన మాత్రము చేతనే ఆత్మ విశ్వాసం పెరిగి మనస్సులో ఉన్న భయాలు బాధలు తొలగిపోతాయి.

13, జులై 2016, బుధవారం

జైమిని పద్ధతిలో కారకాంశ లగ్నం ప్రాముఖ్యత

జైమిని పద్ధతిలో కారకాంశ లగ్నం ప్రాముఖ్యత

బృహత్ పరాశర హోరశాస్త్రము తర్వాత అంతటి శ్రేష్టమైన కృతి జైమినీ సూత్రాలు .ఇందులో జైమినీ, బృహత్ పరాశర హోరశాస్త్రానికి టీకాతాత్పర్య సహిత విస్తృతమైన భాష్యాన్ని చెప్పి జైమినీ జోతిష్యశాస్త్రానికి శ్రీకారం చుట్టాడు. జైమిని మహాముని జైమిని సూత్రం ప్రకారం సర్వ శుభా శుభ ఫలములను కలిగించు ఆత్మకారక గ్రహం ద్వారా సమస్త ఫలితాలను పరిశోధించవచ్చును. ఆత్మకారక గ్రహం బలంగా ఉంటే అత్యంత శుభ ఫలితాలు పొందవచ్చును. ఆత్మకారక గ్రహమునకు అతి తక్కువ భాగాలలో ఉన్న అంత్య గ్రహమునకు మధ్యనున్న గ్రహములను మధ్యగ్రహములు లేదా ఉపగ్రహములు అంటారు. ఈ ఉపగ్రహములు ఎంతటి బలమైనను ఆత్మకారక గ్రహం బలహీనముగా ఉన్నప్పుడూ తమ యొక్క శుభ ఫలితాలను సంపూర్ణముగా ఇవ్వలేవు. 

1, జులై 2016, శుక్రవారం

విష్ణు సహస్త్ర నామం

విష్ణు సహస్త్ర నామం


విష్ణు సహస్త్రనామాన్ని మొత్తం చదివిన తరువాత మీ నక్షత్ర పాదానికి చెందిన శ్లోకాన్ని చదివిన మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్రన్ని మొత్తం చదవలేని వాళ్ళు వారి జన్మ నక్షత్ర పాదమును బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

అశ్వని నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- విశ్వo విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః:
భూతకృద్భూతబృద్భావో భూతాత్మా భూతభావన: !!1 !!

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...