16, సెప్టెంబర్ 2015, బుధవారం

ద్రేక్కాణం



ద్రేక్కాణం

ప్రధమ ద్రేక్కాణానికి (0° నుండి 10°) అధిపతి నారదుడు
ద్వితీయ ద్రేక్కాణానికి (10°నుండి 20°) అధిపతి అగస్త్యడు
తృతీయ ద్రేక్కాణానికి (20° నుండి 30°) అధిపతి దుర్వాసుడు.

ద్రేక్కాణం వలన జాతకుని ప్రకృతి,గుణం,,క్రియాకలాపాలు,అదృష్టాలు,సోదర సహకారాలు,రోగ తీవ్రత,రోగ ఉపశమనం మొదలగు వాటి గురించి తెలుసుకోవచ్చును.లగ్నం గాని,లగ్నాదిపతి గాని,తృతీయాదిపతి  గాని,భావ కారకుడు కుజుడు గాని ద్రేక్కాణంలో షష్టాష్టకాలు,ద్విద్వాదశాలలో ఉంటే సోదరులతో ఘర్షణ ఉంటుంది.

14, సెప్టెంబర్ 2015, సోమవారం

ద్రేక్కాణ వర్గ చక్రం



 ద్రేక్కాణ వర్గ చక్రం వర్గ చక్రం ద్వారా రోగ నిర్ధారణ,నివారణ

జాతకచక్రంలో రాశిచక్రంలో గ్రహాలు గాని లగ్నం గాని  0° నుండి 10° లోపు ఉంటే ద్రేక్కాణ చక్రంలో అదేరాశిలోను,10°నుండి 20° లోపు గ్రహం గాని లగ్నం గాని  ఉంటే గ్రహాం ఉన్న రాశి నుండి పంచమ స్ధానంలోను,20° నుండి 30° లోపు గ్రహం గాని లగ్నం గాని  ఉంటే  గ్రహం ఉన్న రాశి నుండి నవమ స్ధానంలో గ్రహాలను పొందుపరచాలి.

13, సెప్టెంబర్ 2015, ఆదివారం

శల్య దోష నివారణకు శంకు ఆకారంలో ఉన్న "ఎమితెస్ట్ స్టోన్ పెన్సిల్"

శల్య దోష నివారణకు శంకు ఆకారంలో ఉన్న "ఎమితెస్ట్ స్టోన్ పెన్సిల్"

శల్య దోష నివారణకు శంకు ఆకారంలో ఉన్న ఎమితెస్ట్ స్టోన్ పెన్సిల్ ని భూమిలోపల ఒక అడుగు లోతు గుంత తవ్వి అందు స్ధాపించాలి. శల్యములు అంటే ఎముకలు.ఎముకలకి శనిగ్రహము ప్రాదాన్యత వహిస్తాడు.కాబట్టి శల్యదోషం ఉన్నవారు ఎమితెస్ట్ స్టోన్ పెన్సిల్ ని ఉపయోగిస్తే శల్యదోష నివారణ జరుగుతుంది.భూమి లోపల స్ధాపించటానికి అవకాశం లేనప్పుడు ఎమితెస్ట్ స్టోన్ పెన్సిల్ నిగాని,బాల్ ని గాని,పిరమిడ్ నిగాని పడమర దిక్కున ఉంచిన దోష నివారణ జరుగును.

ఎమితెస్ట్ స్టోన్ శనిగ్రహ ఉపరత్నం.శనిగ్రహ దోషాలు ఉన్నవారు కూడ ఎమితెస్ట్ స్టోన్ పెన్సిల్ని గాని,బాల్ ని గాని,పిరమిడ్ నిగాని ఉదయం చేతిలో కొంతసేపు పట్టుకొని ఉన్న మన శరీరంలో ఉన్న నెగిటివ్ ని ఎమితెస్ట్ స్టోన్ తీసుకొని పాజిటివ్ ఎనర్జీని మనకు అందిస్తాయి.

12, సెప్టెంబర్ 2015, శనివారం

హోరా చక్రం



హోరా చక్రం

జాతకచక్రాన్ని పరిశీలించేటప్పుడు తప్పనిసరిగా వర్గచక్రాలను కూడా పరిశీలించాలి.హోరా వర్గ చక్రం ముఖ్యంగా,ధనం,కుటుంబం,మాట సంబందించిన విషయాలు తెలుసుకోవచ్చు.లగ్న చక్రంలోని ద్వితీయాది పతి ,లాభాధిపతి హోరా చక్రంలో ఉన్న స్ధానాన్ని బట్టి,అతని సంపాదించిన ధనం వినియోగపడుతుందా,కుటుంబానికి ఉపయోగపడతాడ,మాటకు విలువ ఉంటుందో లేదో తెలుసుకోవచ్చును.

8, సెప్టెంబర్ 2015, మంగళవారం

వివాహ పొంతన



వివాహ పొంతన
  
జీవితంలో వివాహం అనేది ఒక ముఖ్య వ్యవహారం.వదూవరుల మద్య భావాలు కలసి ,భావైక్యత ఉందో లేదో తెలుసుకొని వివాహం చేస్తే జీవితం అన్యోన్యంగా ఉండేందుకు అవకాశం ఉంది.దీనికి ముఖ్యంగా లగ్నాన్ని,సప్తమభావాన్ని పరిగణలోకి తీసుకుంటారు.లగ్నంలో తాను,సప్తమంలో భార్య,లేదా భర్త సామాజిక సంబంధాలు ఉన్నాయి.కానీ ఇద్దరి మద్య అభిప్రాయాలు అన్నీ విషయాలలో ఏకీభవించకపోవచ్చు.అయితే కొన్ని ముఖ్యమైన అభిప్రాయాలు కూడా ఏకీభవించకపోతే కలసి జీవించటం కష్టం.

3, సెప్టెంబర్ 2015, గురువారం

అగ్ని,భూతత్వ,వాయు,జలతత్వ రాశులు



అగ్ని,భూతత్వ,వాయు,జలతత్వ రాశులు

మేషం,సింహం,దనస్సు రాశులు అగ్నితత్వ రాశులు.
వృషభం,కన్య,మకర రాశులు భూతత్వ రాశులు.
మిధునం,తుల,కుంభం వాయుతత్వ రాశులు.
కర్కాటకం,వృశ్చికం,మీనం జలతత్వ రాశులు.

అగ్నితత్వ రాశులు :-అగ్నితత్వ రాశులవారు ఉష్ణ తత్వం కలిగి కోప స్వభావాలు కలిగిఉంటారు.న్యాయకత్వం,దైర్యసాహసాలు,శత్రువులపైన విజయాలు.ఆరాటం ,పోరాటం కలిగి ఉంటారు.ఇతరులను ఆకర్షించుట.,ఇతరులను తమ అడుగు జాడలలో నడిపించుట.ఇతరులు పొగిడినచో పొంగిపోయి ఆపదలు కొని తెచ్చుకుందురు.ఎక్కువ మంది అధికారులు గాని,నాయకులు గాని,సైన్యాధిపతులు గాని అగ్నితత్వ రాశుల యందు లగ్నం గాని,చంద్రుడు గాని,సూర్యుడు గాని ఉండగా జన్మింతురు.

2, సెప్టెంబర్ 2015, బుధవారం

గ్రహా దోషాలు-దానాలు

గ్రహా దోషాలు-దానాలు


రవిగ్రహ దోషం ఉన్నవారు గోదుమపిండి,గోధుమరొట్టె,ఆరెంజ్ వస్త్రాలు,రాగి,రాగి జావ,మిరియాలు వస్తువులు దానం చేయవచ్చును.
 

చంద్రగ్రహ దోషం ఉన్నవారు అన్నదానం,బియ్యం,పాలు,నీళ్ళు,కెలుపు కాటన్ వస్త్రాలు,వెండి వస్తువులు,పొంగళి మొదలగునవి దానం చేయవచ్చును.

రాశులు ఆకార స్వరూపాలు



రాశులు ఆకార స్వరూపాలు

 రాశి స్వరూప లక్షణాల ద్వారా జాతకుని లగ్నం గాని,రాశి గాని ఉన్నప్పుడు ఆయా లక్షణాలు కలిగి ఉంటారు.జాతక చక్ర విశ్లేషణలో జాతకుని యొక్క స్వభావ లక్షణాలు తెలుసుకోవచ్చును.
  
మేషరాశి:-మేషమంటే గొర్రె.గొర్రెకు ఉండే తీవ్రత,కలహాశక్తి,ధైర్యం,బలం,వెనుక ముందు ఆలోచింపక ముందుకు అడుగు వేయటం,దూకుడుతనం,న్యాయకత్వ లక్షణాలు,కొండను కూడా డీకొట్టగలననే నమ్మకం. ఆశ,సాహసం కలిగి ఉందురు.మోసాలకు లోనగుదురు.మానవులకు సహాయపడుదురు.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...