27, మే 2015, బుధవారం

నాడీ దోషం

నాడీ దోషం

నాడీ దోషం ఎంతో విశిష్టమైనది.విడువరానిది.వదూవారులిద్దరిదీ ఏకనాడీ అయితే వారి వివాహం ఎట్టి పరిస్ధితులలోను చేసుకొనకూడదు.వదూవరులిద్దరిదీ ఏక శరీర తత్వము కాకూడదు అనేది నాడీ నిర్ణయం.వివాహమునకు తరువాత వ్యక్తి క్రొత్త జీవితములోనికి ప్రవేసించునని పెద్దలు అంటారు, పెద్దలు ఇట్లు చెప్పుట చాలా వరకు సరైనది కూడ. వివాహమునకు తరువాత ప్రారంభమగు క్రొత్త జీవితము సుఖమయముగా వుండుటకు కుండలి యొక్క లెక్కింపు చేసెదరు. కుండలి యొక్క లెక్కింపు క్రమములో అష్టకూటము ద్వారా విచారణ చేసెదరు. ఈ అష్ట కూటము (Ashtkoot)లో ఎనిమిదవ మరియు అంతిమ కూటము నాడీ కూటము. నాడీ కూటమి సరిగా లేకుంటే మిగతా ఏడు కూటాల గుణాల్ని కూడా నాశనం చేస్తుంది.

26, మే 2015, మంగళవారం

నక్షత్రాలు అవయవముల విభజన

నక్షత్రాలు అవయవముల విభజన

జాతకచక్రంలో ఆయా నక్షత్రాలలో పాప గ్రహాలు ఉన్న,గ్రహాలు ఆయా నక్షత్రాలలో శుభత్వాన్ని కోల్పోయి,పాప గ్రహ వీక్షణ కలిగి పాప క్షేత్రాలలో ఉన్నప్పుడు ఆయా నక్షత్రాలకు సంబందించిన అవయవములకు చెందిన వ్యాదులు కలిగే అవకాశం ఉంది.నయం అయ్యే వ్యాదులు షష్టమ భావం ద్వారాను,నయం కాని వ్యాదులు అష్టమ భావం ద్వారాను,పంచమ భావానికి షష్టమ భావానికి సంబందం ఉంటే వ్యాది తొందరగా నయం అవుతుంది. అష్టమ భావానికి షష్టమ భావానికి సంబందం ఉంటే వ్యాది తొందరగా నయం కాదు.

15, మే 2015, శుక్రవారం

నాగదోషం(కాల సర్పదోషం) నివారణకు ఏనుగు వెంట్రుకతో చేసిన రింగ్,కడియం



నాగదోషం
కాల సర్పదోషం.. నాగదోషం..
 
జన్మ జాతకమునందు కాల సర్పదోషం ఉన్నటువంటి వారు.., పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారు.., లేదా వివిధ మంత్ర ఔషదులతో సర్పముల బందించినవారు.., పుట్టలను త్రవ్వినవారు.. పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టినివసించేవారు.., జన్మ జాతకమందు రాహు కేతువుల మద్య గ్రహాలు ఉన్న ,పంచమంలో రాహువు ఉన్న నాగదోషం అంటారు. "కాల సర్పదోషం"(నాగదోషం) కలవారై ఉంటారు.
ఈ దోషం కలవారు వివాహం .., సంతానం.., కుటుంభం.., అభివృద్ధి ..,ఆరోగ్య.., విషయాల్లో అత్యధిక ప్రభావం చూపి భాదించును.


"అపుత్రాః పుత్రశోకం చకూరుపః పుత్ర జాయతే
ఆభర్తా పతిహీనం చ పతి సంగ వివర్జితాః భర్తృత్యక్తా భవేద్రోగా జీవనం దుర్భరం భవేత్ సర్పదోషా భవేర్యస్తు కష్టశోక భయావహమ్"

క్రిష్టల్(స్పటిక) పెన్సిల్ CRYSTAL PENCIL



ఆగ్నేయమూలకు గ్రహాధిపతి శుక్రుడు.

ఆగ్నేయ మూలకు అధిపతి శుక్రుడు.శుక్రుడికి ఉపరత్నం క్రిష్టల్(స్పటికం) ఆగ్నేయంలో దోషం ఉన్నవారు క్రిష్టల్(స్పటిక) బాల్ గాని, క్రిష్టల్(స్పటిక) పిరమిడ్ గాని, , క్రిష్టల్(స్పటిక) పెన్సిల్స్ గాని ఆగ్నేయ మూల ఉంచిన ఆగ్నేయ దిక్కు దోషం నివారించవచ్చును. క్రిష్టల్(స్పటిక) కి నెగిటివ్ ని తీసుకొని పాజిటివ్ ఎనర్జీ ని ఇచ్చే గుణం ఉండటం వల్ల ఆగ్నేయ దిక్కు దోషం ఉన్నవారు తప్పకుండా ఆ దిక్కున క్రిష్టల్(స్పటిక)వస్తువులు ఉంచటం వలన దోషాన్ని నివారించుకోవచ్చును.

14, మే 2015, గురువారం

ద్వాదశ ముహూర్త శుద్దులు

ద్వాదశ ముహూర్త శుద్దులు

ఏ శుభ కార్యానికైనా ముహూర్తం పెట్టేటప్పుడు లగ్నం బలంగా ఉండాలి.ఏ ముహూర్త లగ్నానికి అయిన అష్టమ శుద్ది ఉండాలి.ఏ శుభ కార్యానికి ముహూర్తం పెడుతున్నామో ఆ శుభకార్యానికి వర్తించే గ్రహం ముహూర్త లగ్నంలో అస్తంగత్వం చెందకూడడు.ఆ గ్రహ వర్గోత్తమం చెందితే మంచిది.ఉదా:-వివాహానికి శుక్రుడు కారకుడు .కాబట్టి వివాహ ముహూర్తంలో శుక్రుడు అస్తంగత్వం చెందకూడడు.శుక్రుడు వర్గోత్తమం చెందితే మంచిది.లగ్నానికి గురు దృష్టి మంచిది.
 
లగ్నశుద్ది:-నామకరణం,నిషేకం,గర్భాదానం మొదలగు వాటికి లగ్నశుద్ది ఉండాలి.ముహూర్త లగ్నంలో ఏ గ్రహ ఉండరాదు.కానీ కాళిదాసు మాత్రం లగ్నం నందు గురువు ఉన్నచో ముహూర్తం పనికి వచ్చును అని,మరియు శుభమనియు చెప్పియున్నారు.కావున ముహూర్త లగ్నం నందు గురువు తప్ప మిగిలిన గ్రహాలు ఉండరాదని తెలియజెప్పినాడు.

12, మే 2015, మంగళవారం

గ్రహాలు పరిహారాలు

గ్రహాలు పరిహారాలు

రవి గ్రహం:-‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌’ అనే సంప్రదాయం ప్రసిద్ధమైనది. వాస్తు శాస్త్ర విద్య ఈశాన్యాన ఉన్న నుయ్యి, తూర్పున ఉన్న స్నానగృహం, ఇంట్లో ఈశాన్యాన ఉన్న పూజాగృహం, ఆగ్నేయాన ఉన్న వంటిల్లు బాలభానుని లేతకిరణాల వల్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి. సౌర స్నానాల పేరిట ఆరోగ్యం సాధిస్తున్నారు. ఉదయకాంతి శరీర ఆరోగ్యానికి చాలా మంచిదని కొత్త వైద్య ప్రక్రియ కూడా రూపొందుతున్నది. ఉదయాన సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఉదయకాలపు నడక ఆరోగ్యవంతుల మంచి అలవాట్లు.

8, మే 2015, శుక్రవారం

తారాబలం దోష పరిహారాలు



తారాబలం దోష పరిహారాలు

చంద్రుడు మనకు ఏ తార ద్వారా కనపడతాడో ఆ తార మనకు జన్మ తార అవుతుంది.చంద్రుడు మనస్సుకి,నీటికి కారకుడు.నక్షత్రాన్ని బట్టి మనకు ప్రకృతి తెలుస్తుంది.మన జన్మతార మన మనస్సును నిర్ణయిస్తుంది.దాదాపుగా ఒకే నక్షత్రంలో ఉన్నవారు ఒకే విధమైన మానసిక చంచలత్వం కలగి ఉంటారు.చంద్రుడు 1,3,6,7,10,11 స్ధానాలలో ఉన్నప్పుడు బలంగా ఉంటాడు.

6, మే 2015, బుధవారం

ఆయుర్దాయం (PAM Theory)


జాతకచక్రంలో ఆయుర్దాయం (PAM Theory) పరిశీలన.


జాతకచక్రంలో ఆయుర్ధాయ విషయాలను PAM Theory ద్వారా తెలుసుకోవచ్చును.ఒక వ్యక్తి ఆయుర్ధాయాన్ని నిర్ణయించటానికి అనేక పద్దతులు ఉన్నాయి.అందులో ఈ “PAM Theory “అనేది ఒక పద్దతి.అయితే ప్రామాణిక జ్యోతిష్య గ్రంధాలను అనుసరించి 12 సంవత్సరాల వయస్సు దాటే వరకు ఆయుర్ధాయ నిర్ణయం చేయటం కష్ట సాద్యము.దీనికి కారణం అప్పుడే పుట్టిన శిశువు యొక్క ఆయుర్ధాయం తల్లిదండ్రులు చేసే కర్మలపై ఆధారపడి ఉంటుంది.కాబట్టి శిశువు యొక్క ఆయుర్ధాయ విషయాలు 12 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు చేసే కర్మలపై ఆదారపడి ఉంటుంది.అయితే జ్యోతిష్యులు జాతకుడికి ఆయుర్ధాయ విషయాలను తెలియజేయరాదు.అలా తెలియజేసిన ఆ జాతకుడు మానసిక వ్యదకు లోనై తీవ్ర మనోవ్యదను అనుభవిస్తారు.

5, మే 2015, మంగళవారం

నవరత్నాలు

జ్యోతిష్య నవరత్నాలు

నవరత్నాలు అనేవి భూసంపద, జలసంపదల నుండి ఉద్భవిస్తాయి. భూమిలో పై పొర సుమారు 60 మైళ్లు ఉంటుంది. ఈ నాటికి భూమిలోనికి తవ్వగలిగిన గరిష్ఠదూరం 5 కి||మీ మాత్రమే. భూమిలోనికి వెళ్లిన కొలది ఉష్ణోగ్రత పెరుగుతూ, ప్రతి 120 అడుగులకు 1 డిగ్రీ చొప్పున పెరుగుతుంది. ఇలా 30 మైళ్ల లోతులో 1200 డిగ్రీ సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ అంతా ద్రవరూపంలో ఉంటుంది. అలా భూమిలోనికి వెళ్లినకొలది అనేక ఖనిజాలూ, రత్నాలూ ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

1, మే 2015, శుక్రవారం

కర్తరీ

కర్తరీ

సాధారణంగా కర్తరీ మే నెల 4 వతేదీన డొల్లుకర్తరీ ,మే నెల 11 వ తేదీన నిజకర్తరీ ప్రారంబమై మే నెల 28 వ తేదీతో కర్తరీ త్యాగం జరుగుతుంది.

సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 4 వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మద్య కాలాన్ని “కర్తరీ” అంటారు.అంటే భరణి నాలుగో పాదం ,కృత్తిక నాలుగు పాదాలు,రోహిణి మొదటి పాదం మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరీ అంటారు.దీనినే “కత్తెర” అనికూడ అంటారు. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు.డిగ్రీలలో చెప్పాలంటే మేషరాశిలో(డిగ్రీల 23°-20' నిమిషాలు) నుండి వృషభరాశిలో (డిగ్రీల 26°-40' నిమిషాలు).

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...