30, అక్టోబర్ 2012, మంగళవారం

ఇంద్రజాల్(Indrajal)

కుజగ్రహ,దక్షిణదిక్కు దోషాల నివారణకు ఇంద్రజాల్  

ఇంద్రజాల్ ఒక అరుదైన సముద్రపు మొక్క.ఇంద్రజాల్ ప్రాముఖ్యత గురించి Daawaratantra, Vishwasaara, Raavana Samhitaaమొదలగు గ్రంధములలో వివరించారు.ఇంద్రజాల్ మొక్క సముద్రంలో అడుగు భాగంలో లభించే సముద్రపు మొక్క.ఇంద్రజాల్ సముద్రపు అడుగు భాగంలో ఉన్నప్పుడు ఎరుపు రంగులో ఉండే పోలీస్ పురుగులు అనే పురుగులు ఈ మొక్కకు వచ్చి చనిపోతాయి.ఈ మొక్కకు వచ్చి చనిపోయిన పురుగులతో కూడిన మొక్క కొన్ని సంవత్సరాల తరువాత పగడం (Coral) తయారవుతుంది.ఈ మొక్క పోలీసు పురుగులను ఆకర్షిస్తుంది కాబట్టి ఈ మొక్కకు ఆకర్షణ శక్తి ఉన్నది అని పరిశోదకుల పరిశీలనలో తేలిన ముఖ్య విషయం.

13, అక్టోబర్ 2012, శనివారం

హతాజోడి (HATHA JODI)

హతాజోడి
                         హతాజోడి మడచిన చేతుల ఆకారంలో వున్న చాలా అరుదైన మొక్క యొక్క వేరు(మూలం).ఈ మొక్క ముఖ్యంగా మధ్యప్రదేశ్ లోని అమర్ కంటక్ కొండలలోను మరియు నేపాల్ లుంబిని లోయలోను ఎక్కువగా కనబడుతుంది.ఈ మొక్క నీలం రంగుతో తెల్లని పుష్పాలను కలిగి ఉంటుంది.ఇది ఉమ్మెత్త మొక్కను పోలి ఉంటుంది.హాతాజోడి మూలాన్ని నువ్వుల నూనెలో ఉంచితే ఒక నెలలో కిలోన్నర దాక నూనెని స్వీకరిస్తుంది
                      .హతాజోడి వేరు చుట్టు కొంత కొవ్వు కలిగి పెద్ద సైజులో ఉంటుంది.నూనెలో వేసిన తరువాత నూనెను పీల్చి చిన్న సైజులోకి వస్తుంది.హతాజోడి వేరుని ప్రత్యేకమైన అమావాస్య ఆదివారం ,లేదా ప్రత్యేకమైన యోగ సమయాలలో సేకరిస్తారు.మధ్యప్రదేశ్ ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఈ మొక్క కాండాన్ని తాంత్రిక, వశీకరణ చర్యలకు వాడుదురు. ఈ మొక్క కాండాన్ని కలిగి ఉంటే దుష్ట శక్తులు వెళ్ళిపోతాయని, చాముండేశ్వరీ దేవి స్వరూపమని, అది ఇంట్లో ఉంటే అదృష్టమని కొందరు భావిస్తారు. అలాగే తాంత్రికులు ఈ మొక్క వేరుని రెండు చేతులు నమస్కారం పెట్టినట్లుగా తయారుచేసి మార్కెట్టులో "హతాజోడి" అనే పేరుతో అమ్ముతారు.

12, అక్టోబర్ 2012, శుక్రవారం

పాదరస గణపతి

 పాదరస గణపతి
జాతకచక్రం లో చంద్రుడు అనుకూలంగా లేనప్పుడు మనస్సు చంచలంగా ఉంటుంది.మానసిక చికాకులు ఉంటాయి.ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం.సరియైన నిర్ణయాలు తీసుకోలేక పోవటం. తల్లితండ్రులకి సంబందించిన సమస్యలు,స్ధిర ఆస్తులకు సంబందించిన సమస్యలు ఉంటాయి .

పాదరస గణపతి ని పూజించటం వలన ఈ సమస్యలు నివారించవచ్చును.

శ్వేతార్క గణపతి(తెల్ల జిల్లేడు గణపతి)

వాస్తుదోష నివారణకు తెల్లజిల్లేడు గణపతి
శ్వేతార్క గణపతి
సూర్యగ్రహ దోష నివారణకు శ్వేతార్క గణపతి(తెల్ల జిల్లేడు గణపతి)

శ్వేతార్కంలో "శ్వేతం" అంటే తెలుపు వర్ణం,"అర్క" అంటే సూర్యుడు.జాతకచక్రం లోసూర్యగ్రహ దోషాలు ఉన్నవారు,జాతకచక్రంలో సూర్యుడు నీచలో ఉన్నవారు ఇంటికి నరదృష్టి ఉన్నవారు,వీధిపోటు ఉన్నవారు ,సర్వకార్య సిధ్ధి కొరకు శ్వేతార్క గణపతిని ఇంటిలో పెట్టి పూజించాలి.తెల్లజిల్లేడు చెట్టు 45 సం|| దాటిన తర్వాత సహజంగానే గణపతి రూపం వస్తుంది.ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం రోజున వేరును స్వీకరించాలి.శ్వేతార్క మూలగణపతిని శుద్ధమైన నీతితో కడిగి, తర్వాత దానిపై ఎర్రని వస్త్రం మీద పెట్టి పూజ చేయాలి. పూజలో ఎర్ర చందనం, అక్ష త లు, ఎర్రపూలు సింధూరం ఎరుపు రంగు ఉండే వస్తువులే ఎక్కువగా వాడాలి. ధూపదీప నైవేద్యా లు సమర్పించాలి. వీటితో ఒక నాణాన్ని దక్షిణ గా సమర్పించి తర్వాత ఈ దిగువ ఇచ్చిన మం త్రాలలో ఏదో ఒక మంత్రంతో గణేశుని పూజ చేయాలి.

సియార్ సింగ్(Sigar Singi Or Jackal Horn)

సియార్ సింగ్
             సియార్ సింగ్ అంటే నక్క కొమ్ము.ఇది పర్వత ప్రాంత అడవులలో లభ్యమవుతుంది.నక్క యవ్వనంలో ఉన్నప్పుడు శరీరంలోని నుదిటి మీద చిన్న కొమ్ము ఉద్భవిస్తుంది.దీనిని అనుభవము ఉన్న వారు చాకచక్యంగా చేతితో నుదిటి మీద ఉన్న కొమ్మును సేకరిస్తారు.

10, అక్టోబర్ 2012, బుధవారం

చంద్రకళ రుద్రాక్ష కవచం

చంద్ర కళ రుధ్రాక్ష మాల
                   చంద్ర కళ రుధ్రాక్ష మాలలో 9 ద్విముఖి రుధ్రాక్షలు కలిగి ఉంటుంది.జాతకచక్రంలో చంద్రుడు అనుకూలంగా లేనివారు ఈ చంద్రకళ మాలను ధరిస్తే చంద్రగ్రహా దోషాలను నివారించుకోవచ్చును.
              చంద్ర గ్రహా  దోషాలు గలవారు జీవితంలో ఒడుదుడుకులు అనుభవిస్తారు.అమావాస్య ,పౌర్ణమి రోజులలో మానసిక ఒత్తిడికి లోనవుతారు.ఉద్రేక స్వభావాలు కలిగి ఉంటారు.మనస్సు స్ధిరంగా లేక చంచలత్వం కలిగి ఉంటారు.

5, అక్టోబర్ 2012, శుక్రవారం

సరస్వతి రుధ్రాక్ష కవచం


సరస్వతి రుధ్రాక్ష కవచం
                    సరస్వతి రుద్రాక్ష కవచం విధ్యాభివృధ్దికి చాలా మంచిది. సరస్వతి రుద్రాక్ష కవచంలో 4,5,6 ముఖాల రుధ్రాక్షలు ఉంటాయి.

                    సరస్వతి రుద్రాక్ష కవచంలో ఉన్న 4 ముఖాల రుధ్రాక్షకి బుధ గ్రహాం అధిపతి.4 ముఖాల రుధ్రాక్ష వలన పిల్లలకి తనంతట తాను చదువుకోవాలనే బుధ్దిని కలిగిస్తుంది.మంచి ఙ్ఞాపక శక్తి కలిగిస్తుంది.వాక్కుశుధ్ది కలిగిస్తుంది.రచన సామర్ధ్యాన్ని కలిగిస్తుంది.మానసిక స్వస్ధత కలుగుతుంది.బుధ్ది వికాసం కలుగుతుంది.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...