18, జులై 2012, బుధవారం

శ్రావణ మంగళవార వ్రతం

శ్రావణ మంగళవార వ్రతం
(Shravana Mangalavara Vratam)


శ్రావణ మంగళవార వ్రతం పూనిన మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువులనీ, రెండవ సంవత్సరం పదిమందినీ, మూడో యేడు పదిహేను మందినీ, నాలుగో ఏట ఇరవై మందినీ, అయిదవ సంవత్సరం ఇరవై అయిదు మంది ముత్తయిదువులనూ పిలిచి, పసుపు రాసి, బొట్టు పెట్టి, కాటుకిచ్చి, శనగలూ కొబ్బరీ వగైరా వాయనాలివ్వాలి.
అయిదేళ్ళ తర్వాత ఉద్యాపన చేయాలి.
ఉద్యాపన
అయిదేళ్ళయ్యాక ముప్ఫయి మూడు జతల అరిసెలను ఒక కొత్త కుండలో పెట్టి, ఆ పైన కొత్త రవికెల గుడ్డతో వాసెన గట్టి మట్టేలూ మంగళసూత్రాలూ వగైరా మంగళాభరణాలతో పెళ్ళి కూతురుకు వాయనమియ్యాలి. పద్దతి లోపించినా ఫలితం లోపించదు.

క్రిష్టల్ బాల్(Crystal Ball)

క్రిష్టల్ బాల్
             ఫెంగ్‌షుయ్ శాస్త్రం ప్రకారం స్పటికాన్ని (క్రిస్టల్) నైరుతి దిశలో ఉంచితే ఆ కుటుంబ సంబంధాలు మెరుగవడంతో పాటు పెళ్ళికాని వారికి వివాహం కుదరడం జరుగుతుంది. అలాగే ఈ స్పటికాలను ఈశాన్య దిశలో వేలాడ దీయడం ద్వారా మీ పిల్లలు అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తారు.

    ఉదయాన్నే స్పటికాన్ని ఈశాన్య గదిలోని ఈశాన్య మూలలో ఉంచి, ఐదు నిమిషాల పాటు లేత సూర్య కిరణాలు దానిపై పడేట్లు చేయాలి. ఇలా చేసిన తర్వాత క్రిస్టల్‌లోనికి చూస్తూ... మనకు కావాల్సిన కోరికకు సంబంధించిన దృశ్యాన్ని ఊహించుకున్నట్లైతే ఆ కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

పసుపు కేరువా మాల


పసుపు కేరువా మాల


             రుద్రాక్ష మాల మాదిరిగానే, పసుపు కేరువా మాలను కూడా పరమ పవిత్రమైందిగా భావిస్తారు. పసుపు కేరువామాల చేపట్టిన పనిలో విజయం చేకూరుస్తుంది. గణపతికి ఈ కేరువా మాల అంటే మహా ఇష్టం.

             పార్వతీదేవి నలుగుపిండితో గణపతిని రూపొందించిన సంగతి మనకు తెలుసు. నలుగుపిండి పసుపే కదా!. కనుక పార్వతీదేవికీ, గణపతికీ కూడా పసుపు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పసుపు కేరువా మాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...