26, నవంబర్ 2012, సోమవారం

ఫినిక్స్,పోనిక్స్ Phoenix Bird


ఫినిక్స్ పక్షి
            

        ఫినిక్స్ పక్షిని స్వర్గ లోకపు పక్షి అని,స్వర్గ లోకపు దేవత అని అంటారు.ఈ పక్షి ముఖ్యంగా కుటుంబంలోని మహిళలు కోరుకున్న మరియు మనసులో తలచుకున్న ఆలోచనలను తీరుస్తుంది అని ప్రతీతి.
         ఫినిక్స్ పక్షి వ్యాపార,ఉద్యోగ,వృత్తి,కుటుంబ విషయాలలో అదృష్టాన్ని కలిగిస్తుంది.ఆశ్చర్యమైన విజయావకాశాలను కలిగిస్తుంది.

5, నవంబర్ 2012, సోమవారం

కస్తూరి(Musk)


శుక్రగ్రహ దోష నివారణకు కస్తూరి
జాతకచక్రంలో శుక్రగ్రహ దోషం ఉన్నవారికి వివాహం తొందరగా కాక పోవటం,వివాహ విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్ట పోవటం,వివాహం అయిన తరువాత దంపతుల మద్య విభేదాలు,వాహన సౌఖ్యత లేకపోవటం జరుగుతుంది.శుక్రగ్రహ దోష నివారణకు కస్తూరి ని పూజా మందిరంలో ఉంచి పూజ చేసుకోవచ్చును.

ఎర్రటి జాకెట్టు గుడ్డలో ఉంచి బీరువాలోగాని,లాకర్లో గాని ఉంచిన డబ్బు వృధాగా ఖర్చు అవ్వదు.ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు కస్తూరిని వెంట తీసుకొని వెళ్తే సమయం వృధా కాకుండా పనులు పూర్తవుతాయి.కస్తూరి లోపల ఉండే పొడిని గంధంతోపాటు నుదుట ధరించిన నరదృష్టి ఉండదు.మరియు దృష్టి లోపాలు (కంటి లోపాలు )ఉండవు. 

4, నవంబర్ 2012, ఆదివారం

జ్యోతిష్యంలో శని గ్రహం యొక్క వివరణ, కారకత్వం,వ్యాధులు,వృత్తులు వ్యాపారాలు,పరిహారాలు(రెమిడీస్) .

శని గ్రహం యొక్కరూపము

శని నీల కాంతి కలిగిన మేని ఛాయ కలవాడు. నాలుగు భుజములు కలవాడు. ధనుర్భాణాలు, శూలం ధరించిన వాడు. కాకిని వాహనంగా చేసుకున్న వాడు. శనికి నిదానంగా సూర్యుడిని చుట్టి వస్తాడు కనుక మందుడు అని పిలుస్తారు. పంగు, సౌరి అను ఇతర నామాలు ఉన్నాయి. సూర్యుడికి ఛాయాదేవికి కలిగిన పుత్రుడు. మాఘ మాసం కృష్ణ పక్షం చతుర్ధశి నాడు ధనిష్ఠా నక్షత్రంలో విభవానామ సంవత్సరంలో జన్మించాడు. శనిభగవానుడి సోదరి యమున, సోదరుడు యముడు, భార్య జ్యేష్టాదేవి. సూర్యుడి భార్య త్వష్ట ప్రజాపతి కుమార్తె సజ్ఞాదేవి సూర్యుడి తాపం భరించ లేక తనకు ప్రతిగా ఛాయాదేవిని సృష్టించి పుట్టింటికి వెళ్ళిన సమయంలో శని జన్మించాడు. తరువాత కాలంలో సూర్యుడిని చేరిన సజ్ఞాదేవి శనిని సరిగా చూడని కారణంగా శని ఆమెను కాలితో తన్నాడు. ఆకారణంగా శనిని ఆమె శపించంగా శనికి మందగమనం ప్రాప్తించింది.

3, నవంబర్ 2012, శనివారం

లక్ష్మీకారక గవ్వలు

లక్ష్మీ కారక గవ్వలు
         గవ్వల్లో పసుపు రంగులో మెరిసే గవ్వల్ని లక్ష్మీ గవ్వలు అంటారు. లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. లక్ష్మీకారక గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి.శంఖాలకు ఏవిదమైన ప్రాదాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాదాన్యత ఉంది.
           గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు.ఇంకా అనేక దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం అమలులో ఉంది.దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది .గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్మకం .

30, అక్టోబర్ 2012, మంగళవారం

ఇంద్రజాల్(Indrajal)

కుజగ్రహ,దక్షిణదిక్కు దోషాల నివారణకు ఇంద్రజాల్  

ఇంద్రజాల్ ఒక అరుదైన సముద్రపు మొక్క.ఇంద్రజాల్ ప్రాముఖ్యత గురించి Daawaratantra, Vishwasaara, Raavana Samhitaaమొదలగు గ్రంధములలో వివరించారు.ఇంద్రజాల్ మొక్క సముద్రంలో అడుగు భాగంలో లభించే సముద్రపు మొక్క.ఇంద్రజాల్ సముద్రపు అడుగు భాగంలో ఉన్నప్పుడు ఎరుపు రంగులో ఉండే పోలీస్ పురుగులు అనే పురుగులు ఈ మొక్కకు వచ్చి చనిపోతాయి.ఈ మొక్కకు వచ్చి చనిపోయిన పురుగులతో కూడిన మొక్క కొన్ని సంవత్సరాల తరువాత పగడం (Coral) తయారవుతుంది.ఈ మొక్క పోలీసు పురుగులను ఆకర్షిస్తుంది కాబట్టి ఈ మొక్కకు ఆకర్షణ శక్తి ఉన్నది అని పరిశోదకుల పరిశీలనలో తేలిన ముఖ్య విషయం.

13, అక్టోబర్ 2012, శనివారం

హతాజోడి (HATHA JODI)

హతాజోడి
                         హతాజోడి మడచిన చేతుల ఆకారంలో వున్న చాలా అరుదైన మొక్క యొక్క వేరు(మూలం).ఈ మొక్క ముఖ్యంగా మధ్యప్రదేశ్ లోని అమర్ కంటక్ కొండలలోను మరియు నేపాల్ లుంబిని లోయలోను ఎక్కువగా కనబడుతుంది.ఈ మొక్క నీలం రంగుతో తెల్లని పుష్పాలను కలిగి ఉంటుంది.ఇది ఉమ్మెత్త మొక్కను పోలి ఉంటుంది.హాతాజోడి మూలాన్ని నువ్వుల నూనెలో ఉంచితే ఒక నెలలో కిలోన్నర దాక నూనెని స్వీకరిస్తుంది
                      .హతాజోడి వేరు చుట్టు కొంత కొవ్వు కలిగి పెద్ద సైజులో ఉంటుంది.నూనెలో వేసిన తరువాత నూనెను పీల్చి చిన్న సైజులోకి వస్తుంది.హతాజోడి వేరుని ప్రత్యేకమైన అమావాస్య ఆదివారం ,లేదా ప్రత్యేకమైన యోగ సమయాలలో సేకరిస్తారు.మధ్యప్రదేశ్ ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఈ మొక్క కాండాన్ని తాంత్రిక, వశీకరణ చర్యలకు వాడుదురు. ఈ మొక్క కాండాన్ని కలిగి ఉంటే దుష్ట శక్తులు వెళ్ళిపోతాయని, చాముండేశ్వరీ దేవి స్వరూపమని, అది ఇంట్లో ఉంటే అదృష్టమని కొందరు భావిస్తారు. అలాగే తాంత్రికులు ఈ మొక్క వేరుని రెండు చేతులు నమస్కారం పెట్టినట్లుగా తయారుచేసి మార్కెట్టులో "హతాజోడి" అనే పేరుతో అమ్ముతారు.

12, అక్టోబర్ 2012, శుక్రవారం

పాదరస గణపతి

 పాదరస గణపతి
జాతకచక్రం లో చంద్రుడు అనుకూలంగా లేనప్పుడు మనస్సు చంచలంగా ఉంటుంది.మానసిక చికాకులు ఉంటాయి.ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం.సరియైన నిర్ణయాలు తీసుకోలేక పోవటం. తల్లితండ్రులకి సంబందించిన సమస్యలు,స్ధిర ఆస్తులకు సంబందించిన సమస్యలు ఉంటాయి .

పాదరస గణపతి ని పూజించటం వలన ఈ సమస్యలు నివారించవచ్చును.

శ్వేతార్క గణపతి(తెల్ల జిల్లేడు గణపతి)

వాస్తుదోష నివారణకు తెల్లజిల్లేడు గణపతి
శ్వేతార్క గణపతి
సూర్యగ్రహ దోష నివారణకు శ్వేతార్క గణపతి(తెల్ల జిల్లేడు గణపతి)

శ్వేతార్కంలో "శ్వేతం" అంటే తెలుపు వర్ణం,"అర్క" అంటే సూర్యుడు.జాతకచక్రం లోసూర్యగ్రహ దోషాలు ఉన్నవారు,జాతకచక్రంలో సూర్యుడు నీచలో ఉన్నవారు ఇంటికి నరదృష్టి ఉన్నవారు,వీధిపోటు ఉన్నవారు ,సర్వకార్య సిధ్ధి కొరకు శ్వేతార్క గణపతిని ఇంటిలో పెట్టి పూజించాలి.తెల్లజిల్లేడు చెట్టు 45 సం|| దాటిన తర్వాత సహజంగానే గణపతి రూపం వస్తుంది.ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం రోజున వేరును స్వీకరించాలి.శ్వేతార్క మూలగణపతిని శుద్ధమైన నీతితో కడిగి, తర్వాత దానిపై ఎర్రని వస్త్రం మీద పెట్టి పూజ చేయాలి. పూజలో ఎర్ర చందనం, అక్ష త లు, ఎర్రపూలు సింధూరం ఎరుపు రంగు ఉండే వస్తువులే ఎక్కువగా వాడాలి. ధూపదీప నైవేద్యా లు సమర్పించాలి. వీటితో ఒక నాణాన్ని దక్షిణ గా సమర్పించి తర్వాత ఈ దిగువ ఇచ్చిన మం త్రాలలో ఏదో ఒక మంత్రంతో గణేశుని పూజ చేయాలి.

సియార్ సింగ్(Sigar Singi Or Jackal Horn)

సియార్ సింగ్
             సియార్ సింగ్ అంటే నక్క కొమ్ము.ఇది పర్వత ప్రాంత అడవులలో లభ్యమవుతుంది.నక్క యవ్వనంలో ఉన్నప్పుడు శరీరంలోని నుదిటి మీద చిన్న కొమ్ము ఉద్భవిస్తుంది.దీనిని అనుభవము ఉన్న వారు చాకచక్యంగా చేతితో నుదిటి మీద ఉన్న కొమ్మును సేకరిస్తారు.

10, అక్టోబర్ 2012, బుధవారం

చంద్రకళ రుద్రాక్ష కవచం

చంద్ర కళ రుధ్రాక్ష మాల
                   చంద్ర కళ రుధ్రాక్ష మాలలో 9 ద్విముఖి రుధ్రాక్షలు కలిగి ఉంటుంది.జాతకచక్రంలో చంద్రుడు అనుకూలంగా లేనివారు ఈ చంద్రకళ మాలను ధరిస్తే చంద్రగ్రహా దోషాలను నివారించుకోవచ్చును.
              చంద్ర గ్రహా  దోషాలు గలవారు జీవితంలో ఒడుదుడుకులు అనుభవిస్తారు.అమావాస్య ,పౌర్ణమి రోజులలో మానసిక ఒత్తిడికి లోనవుతారు.ఉద్రేక స్వభావాలు కలిగి ఉంటారు.మనస్సు స్ధిరంగా లేక చంచలత్వం కలిగి ఉంటారు.

5, అక్టోబర్ 2012, శుక్రవారం

సరస్వతి రుధ్రాక్ష కవచం


సరస్వతి రుధ్రాక్ష కవచం
                    సరస్వతి రుద్రాక్ష కవచం విధ్యాభివృధ్దికి చాలా మంచిది. సరస్వతి రుద్రాక్ష కవచంలో 4,5,6 ముఖాల రుధ్రాక్షలు ఉంటాయి.

                    సరస్వతి రుద్రాక్ష కవచంలో ఉన్న 4 ముఖాల రుధ్రాక్షకి బుధ గ్రహాం అధిపతి.4 ముఖాల రుధ్రాక్ష వలన పిల్లలకి తనంతట తాను చదువుకోవాలనే బుధ్దిని కలిగిస్తుంది.మంచి ఙ్ఞాపక శక్తి కలిగిస్తుంది.వాక్కుశుధ్ది కలిగిస్తుంది.రచన సామర్ధ్యాన్ని కలిగిస్తుంది.మానసిక స్వస్ధత కలుగుతుంది.బుధ్ది వికాసం కలుగుతుంది.

18, జులై 2012, బుధవారం

శ్రావణ మంగళవార వ్రతం

శ్రావణ మంగళవార వ్రతం
(Shravana Mangalavara Vratam)


శ్రావణ మంగళవార వ్రతం పూనిన మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువులనీ, రెండవ సంవత్సరం పదిమందినీ, మూడో యేడు పదిహేను మందినీ, నాలుగో ఏట ఇరవై మందినీ, అయిదవ సంవత్సరం ఇరవై అయిదు మంది ముత్తయిదువులనూ పిలిచి, పసుపు రాసి, బొట్టు పెట్టి, కాటుకిచ్చి, శనగలూ కొబ్బరీ వగైరా వాయనాలివ్వాలి.
అయిదేళ్ళ తర్వాత ఉద్యాపన చేయాలి.
ఉద్యాపన
అయిదేళ్ళయ్యాక ముప్ఫయి మూడు జతల అరిసెలను ఒక కొత్త కుండలో పెట్టి, ఆ పైన కొత్త రవికెల గుడ్డతో వాసెన గట్టి మట్టేలూ మంగళసూత్రాలూ వగైరా మంగళాభరణాలతో పెళ్ళి కూతురుకు వాయనమియ్యాలి. పద్దతి లోపించినా ఫలితం లోపించదు.

క్రిష్టల్ బాల్(Crystal Ball)

క్రిష్టల్ బాల్
             ఫెంగ్‌షుయ్ శాస్త్రం ప్రకారం స్పటికాన్ని (క్రిస్టల్) నైరుతి దిశలో ఉంచితే ఆ కుటుంబ సంబంధాలు మెరుగవడంతో పాటు పెళ్ళికాని వారికి వివాహం కుదరడం జరుగుతుంది. అలాగే ఈ స్పటికాలను ఈశాన్య దిశలో వేలాడ దీయడం ద్వారా మీ పిల్లలు అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తారు.

    ఉదయాన్నే స్పటికాన్ని ఈశాన్య గదిలోని ఈశాన్య మూలలో ఉంచి, ఐదు నిమిషాల పాటు లేత సూర్య కిరణాలు దానిపై పడేట్లు చేయాలి. ఇలా చేసిన తర్వాత క్రిస్టల్‌లోనికి చూస్తూ... మనకు కావాల్సిన కోరికకు సంబంధించిన దృశ్యాన్ని ఊహించుకున్నట్లైతే ఆ కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

పసుపు కేరువా మాల


పసుపు కేరువా మాల


             రుద్రాక్ష మాల మాదిరిగానే, పసుపు కేరువా మాలను కూడా పరమ పవిత్రమైందిగా భావిస్తారు. పసుపు కేరువామాల చేపట్టిన పనిలో విజయం చేకూరుస్తుంది. గణపతికి ఈ కేరువా మాల అంటే మహా ఇష్టం.

             పార్వతీదేవి నలుగుపిండితో గణపతిని రూపొందించిన సంగతి మనకు తెలుసు. నలుగుపిండి పసుపే కదా!. కనుక పార్వతీదేవికీ, గణపతికీ కూడా పసుపు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పసుపు కేరువా మాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.

27, జూన్ 2012, బుధవారం

గోమతిచక్రాలు(GOMATI CHAKRALU)













గోమతిచక్రాలు
                గోమతిచక్రాలు అరుదైన సహజసిధ్ధంగా లభించే సముద్రపు ఉత్పత్తి. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు ద్వారకలోని గోమతి నది నందు లభిస్తాయి.చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతోఇవి రూపు దిద్దుకుంటాయి..ఈరెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం.ఈశుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని చెప్పవచ్చును. జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ధ్యానికి,ప్రేమ,దాంపత్య సౌఖ్యం,సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తుండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి.

26, జూన్ 2012, మంగళవారం

NAVAGRAHA TEMPLES(నవగ్రహా ఆలయాలు)

నవగ్రహ అలయలు మొత్తముగా తమిలనాడులో ఉన్నవి. అవి
 1)సూర్య గ్రహానికి గాను సూరియానారు
2) చంద్ర గ్రహానికి గాను తిన్గలూరు.
3)  అంగారక గ్రహనికి గాను వైదీస్వరన్ కొవెల.
4) బుధ గ్రహానికి గాను తిరువెన్కాదు.
5) గురు గ్రహానికి గాను ఆలంగుడి.
6) శుక్ర గ్రహానికి గాను కన్ఛనూరు.
7) శని గ్రహానికి గాను తిరునల్లారు.
8) రాహువు గ్రహానికి గాను తిరునాగేస్వరమ్.
9) కేతు గ్రహానికి గాను కీల్రుమ్పల్లమ.

19, జూన్ 2012, మంగళవారం

ఓంకార ధ్వని గంట(OM BELL)

ఓంకార ధ్వని గంట
                ఓంకార ధ్వని గంట పూర్తిగా కంచుతో చేయబడి ఉంటుంది. ఓంకార ధ్వని గంట మూడు విభాగాలుగా ఉంటుంది.గంట ఉన్న భాగం పూర్తిగా కంచు తో చేయబడి ఉంటుంది.గంట పైభాగాన ఇత్తడితో చేయబడి ఉంటుంది.గంట అంచు అడుగు భాగాన్ని చేతితో తిప్పటానికి చిన్న కర్ర ఉంటాయి.

11, జూన్ 2012, సోమవారం

బిల్లీ కాజార్(CAT`S CHORD)

బిల్లీ కాజార్:-
               బిల్లీ కాజర్ అంటే పిల్లి గర్భసంచి నుండి వెలువడే ఒక నరం(ప్రేగు).పిల్లి గర్భం దాల్చిన తరువాత పిల్లి పిల్లను బయటకు వదిలేటప్పుడు ఒక నరాన్ని బయటకు వదులుతుంది.పిల్లి కనే టప్పుడు ఎవ్వరిని దగ్గరకు రానివ్వదు.ఏ పిల్లి అయిన కనేటప్పుడు దాని దగ్గరకు వెలితే మీద పడి రక్కుతుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలెను.పిల్లి పెంపకంలో అనుభవం ఉన్న వాళ్ళ ద్వారా మాత్రమే సేకరించాలి.
            పిల్లి నరాన్ని బయటకి వదిలిన తరువాత వెంటనే ఆ నరాన్ని తినేస్తుంది.కాబట్టి మనం వెంటనే ఆ నరం మీద హనుమాన్ సింధూరం వేస్తే ఆ నరాన్ని పిల్లి తినదు.కాబట్టి ఈ విధంగా బిల్లీ కాజార్ ని సేకరించవచ్చు.

ఏ కాక్షి నారికేళం (ONE EYE COCONUT).

ఏ కాక్షి నారికేళం
              ఏకాక్షి నారికేళం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తారు.
ఏ కాక్షి నారికేళం అంటే ఒక కన్ను గల కొబ్బరికాయ అని అర్ధం.సాధారణంగా అన్ని కొబ్బరికాయలకి మూడు కళ్ళు ఉంటాయి.ఈ మూడు కళ్ళలో రెండు కళ్ళు గుండ్రంగాను  ఒక కన్ను వెడల్పు గాను ఉంటుంది.వెడల్పుగా ఉన్న కన్నుని నోరుగాను గుండ్రంగా ఉన్న కళ్ళను రెండు కళ్ళ గాను చెబుతారు.ఏ కాక్షి నారికేళానికి ఒక కన్ను ,ఒక నోరు ఉంటుంది.ఇవి దొరకటం చాలా కష్టం.వేలాది కొబ్బరికాయల్లో ఏ ఒక్కదాంట్లోను ఇలా రావచ్చు.మార్కెట్ లో తాటికాయలనే ఏకాక్షి నారికేళం గా అమ్ముతున్నారు.వీటితో పూజిస్తే ఫలితం శూన్యం.ఏ కాక్షి అంటే ఒక్కటే కన్ను ఉంటుందని అనుకుంటారు కాని ఏ కాక్షి నారికేళానికి ఒక కన్ను,ఒక నోరు ఖచ్చితంగా ఉంటాయి.

11, ఏప్రిల్ 2012, బుధవారం

VAASTU YANTRAM(వాస్తు ఐశ్వర్య కాళీ యంత్రం)

వాస్తుదోష నివారణకు వాస్తు ఐశ్వర్య కాళీ యంత్రం పోస్టర్
వాస్తు ఐశ్వర్య కాళీ యంత్రం
వాస్తు ఐశ్వర్య కాళీ యంత్ర పోస్టర్ ను ఇళ్ళు లేదా షాపు లేదా ఆఫీసు ప్రదాన ద్వారానికి లోపలి వైపు పైభాగాన ఉంచి "ఓం ఇం క్లీం ఐశ్వర్య కాళేయ నమః" అనే మంత్రాన్ని నిత్యం పఠించటం వల్ల వాస్తు దోషాలు పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.కాళికా దేవి తన బంగారు పాదాలతో మన ఇళ్ళు,షాపు,ఆపీసుల లోకి అడుగు పెట్టటం వల్ల ధనాభివృధ్ధి,వ్యాపారాభివృధ్ధి,గౌరవాలు,మంచి కమ్యూనికేషన్ ఉంటాయి.ముఖ్యంగా జాతకచక్రం లో శని దోషాలు కలవారు తప్పని సరిగా ఇంటిలో ఉంచుకోవాలి.నరదిష్టి ప్రభావాలు తొలిగి పోతాయి. 

7, ఏప్రిల్ 2012, శనివారం

CRYSTALS(పింక్ క్రిస్టల్స్ )

పింక్ క్రిస్టల్స్ 

మీ అమ్మాయికి, లేదా అబ్బాయికి పెళ్లి సంబంధం కుదరలేదా? అయితే మీ పిల్లల బెడ్‌రూమ్‌లో హృదయాకారంలో ఉన్న రెండు పింక్ క్రిస్టల్స్‌ ఉంచడం శ్రేయస్కరమని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఇలా ఉంచినట్లయితే, వారికి మంచి పెళ్లి సంబంధాలు రావడం, పెళ్లి కుదరడం జరుగుతుందని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.


SALAGRAMALU(సాలగ్రామము)

సాలగ్రామములు

సాలగ్రామము విష్ణుప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వ్యావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. 

LAUGHING BUDDHA(లాఫింగ్ బుద్ధ)

లాఫింగ్ బుద్ధ



ఫెంగ్ షుయ్ లో ముందుగా మనకు ఎదురయ్యే ఆర్టికల్ లాఫింగ్ బుద్ధ. ఐశ్వర్యం, ఆనందం ఈ రెంటినీ లాఫింగ్ బుద్ధ అందిస్తుంది. అటు ఇంట్లో ఇటు మీ వ్యాపార సంస్థలో లాఫింగ్ బుద్ధను ఉంచుకోవడం వల్ల కుటుంబపరంగా, వ్యాపారపరంగా మీకు మంచి మేలు జరుగుతుంది.

LAKSHMI PYRAMID(లక్ష్మీ ఎనర్జీ పిరమిడ్ బాక్స్)

లక్ష్మీ ఎనర్జీ పిరమిడ్ బాక్స్:
 ఈ లక్ష్మీ ఎనర్జీ పిరమిడ్ బాక్స్ లోపల ఏవ్యక్తిదయిన బ్లాక్& వైట్ పోటో గాని, కలర్ పోటో గాని ఉంచి ఆవ్యక్తికి ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది.ఇంకా గ్రహా భాదల నుండి తట్టుకొనే శక్తిని కల్పిస్తుంది .కనుదృష్టి ,నరదృష్టి మొదలయిన దృష్టి దోషాల నుండి రక్షణ కవచం లాగ పనిచేస్తుంది.

లక్ష్మీ ఎనర్జీ బాక్స్ లోపల పెట్టిన టాబ్లెట్స్ వాటి యొక్క ( యం.జి) పెరుగుతుంది. దీనిలోపల పెట్టిన కూరగాయలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.క్యాష్ బాక్స్ గా వాడుకున్నచో థనానికి సంబందించిన సమస్యలు ఉండవు .కాపర్ యంత్రాలు ఈ బాక్స్ లో 45 రోజులు ఉంచిన ఆ యంత్రాలలో శక్తి ఉత్పాదన జరుగుతుంది .

లక్ష్మీ పిరమిడ్ బాక్స్ లో పెట్టిన భూములకు సంబందించిన విలువైన డాక్యుమెంట్లు గాని, ఇంటి డాక్యుమెంట్లు గాని,షాపు, ప్యాక్టరీకి సంబందించిన డాక్యుమెంట్లు ఎల్లప్పుడు ఈ బాక్సులో ఉంచితే భూములు అథిక దరలు పలకడమే కాకుండ,షాపు, ప్యాక్టరీకి సంబందించిన అభివృద్ది బాగుంటుంది.

ఇంకా ఈ పిరమిడ్ బాక్సులో స్టోన్ రింగ్స్,జపమాలలు, ప్యామిలీపోటోలు,లాకెట్స్ ,గోల్డ్ ఐటం మొదలగు వస్తువులేకాకుండా ఈ బాక్సులో పెట్టిన ఏ వస్తువుకైన రెట్టింపు శక్తిని ఇస్తుంది .

CAR PYRAMID(వాహాన నియంత్రణ పిరమిడ్)

వాహాన నియంత్రణ పిరమిడ్:
ఈ పిరమిడ్ అన్ని వాహానాలలో ఉపయోగించుకొనవచ్చును.పిరమిడ్ లోపల ఉన్న యంత్రం మీద వాహానాన్ని నడుపుతున్న వ్యక్తి యొక్క లేదా వాహానం యొక్క ఓనర్ లేదా వారి ప్యామిలికి చెందిన కలర్ పోటో గాని ,బ్లాక్ &వైట్ పోటోగాని తీసుకొని పోటోలోని బోమ్మ వైపును యంత్రానికి ఆనించి ఉంచి పై పిరమిడ్ క్యాప్ తో మూసివేసి కనీసం 45రోజుల పాటు ఉంచిన పోటోలోని వ్యక్తులకు ఎనర్జీ వస్తుంది.ఆ వ్యక్తులు వాహానం నడిపేటప్పుడు మంచి ఏకాగ్రతతో వాహానం నడప గలరు.అంతేకాక వాహానానికి యాక్సిడెంట్సు కాకుండా కాపాడుతుంది.ఇంకా వాహానానికి ఎక్కువ రిపేర్లు రాకుండా కాపాడుతుంది.ఈ వాహాన నియంత్రణ పిరమిడ్ ఎళ్ళవేళల వాహానానికి రక్షణ కవచం లాగ పనిచేస్తుంది .

EDUCATION PYRAMID(విధ్యా ప్రాప్తి యంత్ర పిరమిడ్)

విధ్యా ప్రాప్తి యంత్ర పిరమిడ్;-
ఈ పిరమిడ్ లోపల చదువు కొనే వ్యక్తుల లేదా విద్యా వ్యాపారాలకు సంబందించిన వ్యక్తుల లేదా పరిశోదన చేసేవారు మరియు విద్యా భోధన చేసేవారు మరియు విద్యలో ఆటంకాలు కలుగుతున్న వారు పోటీ పరీక్షలలో విజయం కోరుకొనేవారు మరియు వ్యాపార,ఉధ్యోగాలలో మెళుకువలు తెలుసుకోవాలనే కోరిక కలిగిన వారు వారి యొక్క కలర్ పోటో గాని,బ్లాక్ &వైట్ పోటో గాని తీసుకొని పోటోలోని బొమ్మ వైపును యంత్రానికి ఆనించి ఉంచి పిరమిడ్ క్యాప్ తో మూసివేసి కనీసం 45 రోజులపాటు ఏవారు కదిలించని సురక్షిత ప్రదేశంలో ఉంచిన ఆపోటో లోని వ్యక్తులకు పాజిటివ్ ఎనర్జీ చేరుతుంది.ఈ విధంగా చేయటం వలన విధ్యార్దులలో తనంతట తాను చదువుకొవాలనే ఆసక్తి కలుగుతుంది.ఙ్ఞాపక శక్తితో పాటు పోటీతత్వంతో చదువుతారు .పరిశోదకులకు పరిశోదనా సామర్ద్యం పెరుగుతుంది.ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపార సంస్దలలోకి వచ్చిన కస్టమర్సును ఆకర్షించే విధంగా వాక్ శుద్ధి కలిగిస్తుంది.ఈ పిరమిడ్ అందరికి ఆలోచనని ,ఙ్ఞానాన్ని కలిగిస్తుంది .

రుధ్రాక్షలు ఉపయోగాలు

రుధ్రాక్షలు ఉపయోగాలు
ఆధ్యాత్మికతతో, ప్రేమపూరకమైన భక్తితో, భక్తి వైరాగ్యంతో నిండిపోయుండే భారతీయుడి హృదయానికీ, రుద్రాక్షకూ అవినాభావ సంబంధం ఉంది. ఈ సంబంధం భక్తుడికీ, భగవంతునికీ ఉన్న సంబంధంవంటిది. రుద్రాక్షను భగవంతునికి ప్రతిరూపంగా భావించే సంప్రదాయం ఆది కాలంనుండీ మనకు వస్తూనే ఉంది. ఇది కేవలం సంప్రదాయంగానే కాక అనేక విశ్వాసాలకు ప్రతిరూపంగా కూడా ఉండడంతో కుల మత ప్రమేయం లేకుండా వీటిని భారతీయులు ధరిస్తుంటారు. ఇవి అత్యంత శక్తివంతమైనవనీ, వీటిని ధరిస్తే ఎటువంటి చెడు ప్రభావం తమపై పడదనే భావన ఉండడంతో వీటికి గిరాకీ ఎక్కువ. చాలా అరుదుగా లభించే రుద్రాక్షలంటే ఎవరైనా ఆరాటపడుతూనే వుంటారు. ఎక్కడ రుద్రాక్షల అమ్మకాలు జరుగుతున్నా వాటికోసం ఎగబడుతుంటారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులుపడుతున్నవారు, వ్యాపారపరంగా కలసిరానివాళ్ళు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారే కాక అద్భుత భవిష్యత్తును ఆశించేవారు కూడా ముందుచూపుగా ఈ రుద్రాక్షలను ధరిస్తుంటారు.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...